Secrets : నమ్మి సీక్రెట్ చెబితే ఊరంతా ఊదేస్తున్నారా? ఈ బిహేవియర్ వెనుక సైకాలజీ ఏంటి..

Secrets : నమ్మి చెప్పిన రహస్యాలు ఎందుకు దాచలేరు? సీక్రెట్స్ లీక్ చేసి డ్రామాలు ఆడే వారి మానసిక ప్రవర్తన, వీళ్లు అసలు ఎందుకు మారరు అనేదానిపై సైకాలజిస్టులు ఏమంటున్నారో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Secrets

ఎవరైనా ఫ్రెండ్స్ ,రిలేటివ్స్‌లో మనసుకు దగ్గరగా ఉన్నారని నమ్మి మన మనసులోని బాధనో, సీక్రెట్‌నో షేర్ చేసుకుని..వారితో వేరే ఎవరితోనూ ఈ విషయం చెప్పొద్దని చెప్పడం చాలామందికి అనుభవమే. అయితే గంట తిరగకముందే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది.

పైగా ఇవతలి వారు చెప్పిన విషయానికి వాళ్లు సొంతంగా మరింత మసాలా పాయింట్లు యాడ్ చేసి మేటర్‌ను స్ప్రెడ్ చేస్తుంటారు. తర్వాత ఇదంతా తెలిసి అయ్యో వీళ్లకు అనవసరంగా చెప్పానని ఫీలవుతుంటారు. ఒకవేళ ఇది ఎందుకు అందరికీ చెప్పారని అవతలి పర్సన్‌ను అడిగితే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుని తాను ఆ మాటే అనలేదని, అభాండాలు వేయొద్దని మీ మాటలకు వారే బాధపడినట్లు సెంటిమెంటల్‌గా మాట్లాడతారు . అయితే ఈ టోటల్ బిహేవియర్ వెనుక ఒక బలమైన సైకాలజీ దాగి ఉందని మానసిక నిపుణులు అంటున్నారు.

మనుషులెవరైనా సరే ఇలా సీక్రెట్స్‌(Secrets)ను దాచుకోలేకపోవడానికి మెయిన్ రీజన్ వారి బ్రెయిన్ వర్కింగ్ స్టైలే. సైకాలజీ ప్రకారం ఎవరైనా వారికి ఒక సీక్రెట్ చెప్పినప్పుడు, దానిని వారి దగ్గరే దాచుకోవడం బ్రెయిన్‌కు ఒక పెద్ద బర్డెన్‌లా ఉంటుంది.

సీక్రెట్ వారి దగ్గర ఉన్నప్పుడు బ్రెయిన్‌లో డోపమైన్ అనే హార్మోన్ ఇన్‌స్టెంట్‌గా రిలీజ్ అవుతుంది. ఆ విషయాన్ని ఎవరికైనా చెప్పేవరకూ ఆ టెన్షన్ కుదురుగా ఉండనివ్వదు. ఎప్పుడైతే ఆ రహస్యాన్ని లేదంటే వారన్న మాటలను ఇంకొకరికి చెప్పేస్తారో, అప్పుడు మెదడుకి ఒక అంతులేని రిలీఫ్, హై కిక్ దొరుకుతుంది. ఆ కిక్ కోసం ఆరాటపడే వాళ్లే ఇలా అవతలి వాళ్ల నమ్మకాన్ని గంగలో కలిపిస్తుంటారు.

సొసైటీలో అటెన్షన్ కోరుకునే మైండ్‌సెట్ ఉన్నవాళ్లు కూడా ఇలాగే చేస్తారు. ఎవరి దగ్గరైనా ఒక హాట్ న్యూస్ లేదా రహస్యం ఉందంటే, ఆ గ్రూప్‌లో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. నాకు ఒక సీక్రెట్ తెలుసు కానీ ఎవరికీ చెప్పనని చెప్పి.. అవతలి వాళ్ల ముందు తాము చాలా గ్రేట్ అనిపించుకోవాలని చూస్తారు. ఆ క్రేజ్ కోసం, లేదంటే నలుగురిలో తమ వాల్యూ పెంచుకోవడం కోసం మన రహస్యాన్ని ఒక వెపన్‌లా వాడుకుంటారు.

అలాగే, వారే ఆ విషయాన్ని చెప్పినట్లుగా బయటపడి పరువు పోయే పరిస్థితి వచ్చినప్పుడు వీరు డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్లిపోతారు. తమ తప్పు ఒప్పుకుంటే సొసైటీలో, తెలిసినవాళ్ల దగ్గర తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే భయం వీళ్లలో చాలా ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి తప్పించుకోవడానికి, అవతలి వాళ్ల సింపతీని కొట్టేయడానికి కన్నీళ్లను ఆయుధంగా మారుస్తారు. తిరిగి తామే బాధితులం అనేలా చెబుతూ ఎదురుదాడికి దిగుతారు.

ఇలాంటి వాళ్లు అంత త్వరగా రియలైజ్ అయి మారే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని సైకాలజీ చెబుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒకరోజు పొరపాటున జరిగే చిన్న తప్పు కాదు, ఇదొక పర్మినెంట్ పర్సనాలిటీ డిజార్డర్ లేదంటే వారి ప్రవర్తనా ధోరణి. వీళ్లకు ఇతరుల ఫీలింగ్స్, నమ్మకం కంటే అందరిలో తమ ఇమేజ్, తాము ఏదో ఒక  ఇంట్రెస్టింగ్ మేటర్ వారికి చెప్పామనే సెల్ఫ్ సాటిస్‌ఫ్యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

అవతలి వాళ్లు దీని వల్ల జరిగిన పరిణామాలతో ఎంత బాధపడినా వీళ్లకు ఆన్ ది స్పాట్ దొరికే కిక్ మాత్రమే కావాలి. ఒకవేళ వారు దొరికిపోయినా భయంతోనో, పరువు పోతుందనే ఫీలింగ్‌తోనో డ్రామాలు ఆడుతారు తప్ప, సారీ చెప్పే గుణం వీరికి అస్సలు ఉండదు.

వీళ్లు ఎవరితోనైనా సరే ఇదే పద్ధతిని ఫాలో అవుతుంటారు. ఈరోజు మనతో ఉండి మన రహస్యాలు ఇంకొకరికి చెబుతారు.. రేపు వేరే వాళ్లతో ఉండి వాళ్ల సీక్రెట్స్(Secrets) గురించి కూడా బయట అలాగే మాట్లాడతారు. అందుకే ఇలాంటి వాళ్లు మారుతారని ఆశించి టైమ్, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కంటే.. వాళ్లతో మన బౌండరీలు గీసుకోవడమే అందరి మానసిక ప్రశాంతతకు ఏకైక మందు అని గుర్తించాలి.

Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్‌కు ఇలా చెక్ పెట్టండి..

↑
Exit mobile version