Cleaning Tips : స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ క్లీనింగ్ ఇలా చేయండి.. స్క్రీన్‌ను సేఫ్ గా ఉంచే ఆ 4 టిప్స్ ఇవే..

Cleaning Tips : కాస్ట్‌లీ గ్యాడ్జెట్స్ లైఫ్ పెరగాలి అంటే.. వాటిని క్లీన్ చేసే విధానం కూడా అంతే సాఫ్ట్ గా ఉండాలి

Cleaning Tips

మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు.. మన ఇంటికి ఒక క్లాస్ లుక్‌ని తెస్తాయి. అయితే వాటిపై దుమ్ము పడటం, ఫింగర్ ప్రింట్స్ పడటం చాలా కామన్. మన ఫోన్ స్క్రీన్, ల్యాప్ ట్యాప్, టీవీపై ఒక్క చిన్న స్క్రాచ్ పడినా మన మనసంతా విలవిలలాడిపోతుంది.

చాలామంది ఇంట్లో దొరికే పాత టవల్స్, బనియన్లు, పేపర్ టిష్యూలతో స్క్రీన్‌ను గట్టిగా రుద్దేస్తుంటారు. కిటికీ అద్దాలు తుడిచినట్లు కోలిన్ లాంటి కెమికల్స్ స్ప్రే చేస్తుంటారు. కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ స్క్రీన్లు.. చాలా అంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. వాటిని రఫ్‌గా క్లీన్ చేస్తే విలువైన డిస్‌ప్లేలు పర్మినెంట్‌గా పాడయిపోతాయి.

అందుకే ఈ కాస్ట్‌లీ గ్యాడ్జెట్స్ లైఫ్ పెరగాలి అంటే.. వాటిని క్లీన్ చేసే విధానం కూడా అంతే సాఫ్ట్ గా ఉండాలి. స్క్రీన్ క్లీనింగ్ కోసం మార్కెట్లో దొరికే ఏవో ఒక బట్టలు వాడకుండా.. స్పెక్స్ట్, కెమెరా లెన్స్ తుడవడానికి వాడే మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే దగ్గర పెట్టుకోవాలి.

అలాగే నార్మల్ ట్యాప్ వాటర్‌లో ఉండే సాల్ట్స్ వల్ల స్క్రీన్‌పై లైన్స్ పడే ప్రమాదం ఉంది కాబట్టి, డిస్టిల్డ్ వాటర్ లేదా బ్రాండెడ్ స్క్రీన్ క్లీనింగ్ లిక్విడ్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అసలు క్లీనింగ్ ప్రాసెస్(Cleaning Tips) విషయానికి వస్తే.. టీవీ, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను క్లీన్ చేసే ముందు ఫస్ట్ పవర్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి.

స్క్రీన్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు క్లీన్ చేయకూడదు. డిస్‌ప్లే పూర్తిగా బ్లాక్ గా ఉన్నప్పుడే దానిపై ఎక్కడ దుమ్ము ఉందో క్లియర్ గా కనిపిస్తుంది. మొదట పొడిగా ఉన్న మైక్రోఫైబర్ క్లాత్‌తో స్క్రీన్‌పై ఉన్న డస్ట్ ను చాలా లైట్ గా తుడిచేయాలి.

ఒకవేళ స్క్రీన్‌పై గట్టి మరకలు ఉంటే.. ఆ క్లీనింగ్ లిక్విడ్‌ను నేరుగా స్క్రీన్‌పై అస్సలు స్ప్రే చేయకూడదు. ఎందుకంటే ఆ కెమికల్ స్క్రీన్ అంచుల గుండా లోపలికి వెళ్లిపోయి సర్క్యూట్ షార్ట్ అయిపోయే డేంజర్ ఉంది. అందుకే కొద్దిగా లిక్విడ్‌ను ఆ మైక్రోఫైబర్ క్లాత్‌పై లైట్‌గా స్ప్రే చేసి.. ఆ తడిగుడ్డతో స్క్రీన్‌ను చాలా లైట్‌గా తుడవాలి.

తుడిచేటప్పుడు ఇష్టం వచ్చినట్లు రుద్దేయకుండా.. గుండ్రంగా కానీ పైనుంచి కిందికి కానీ ఒకే డైరెక్షన్‌లో చేతిని తిప్పాలి. క్లీనింగ్ అయిపోయాక కాసేపు ఆరనిచ్చి.. ఆ తర్వాతే పవర్ ఆన్ చేయాలి. ఈ ప్రాసెస్‌లో పాత టీ షర్టులు, టవల్స్, పేపర్ టవల్స్ , టిష్యూ పేపర్లను అస్సలు వాడకూడదు.

అంతేకాదు కోలిన్, అమ్మోనియా , ఆల్కహాల్, అసిటోన్, డిష్ వాష్ లిక్విడ్స్ వంటివి వాడితే స్క్రీన్‌పై ఉండే ప్రొటెక్టివ్ కోటింగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇక కీబోర్డ్, రిమోట్ వంటి వస్తువుల బటన్స్ మధ్యలో దుమ్ము ఎక్కువగా చేరిపోతుంది. వీటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉండే ఒక పాత సాఫ్ట్ టూత్‌బ్రష్‌ను వాడుకోవచ్చు.

Cleaning Tips

అలాగే డెబ్బై శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను మైక్రోఫైబర్ క్లాత్‌కు లైట్‌గా రాసి బటన్స్ తుడిచేయొచ్చు. మన మొబైల్ బ్యాక్ ప్యానెల్, కెమెరా గ్లాస్‌ను కూడా ఎప్పుడూ మైక్రోఫైబర్ క్లాత్‌తోనే శుభ్రం చేయాలి.

ఒకవేళ ఫోన్ చార్జింగ్ పోర్ట్‌లో కానీ స్పీకర్ గ్రిల్‌లో కానీ డస్ట్ ఇరుక్కుపోతే.. ఒక చిన్న టూత్‌పిక్ సాయంతో చాలా జాగ్రత్తగా దాన్ని బయటకు తీసేయొచ్చు. ఈ సింపుల్ అండ్ స్మార్ట్ టిప్స్(Cleaning Tips) ఫాలో అయితే మీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఎప్పుడూ కొత్తగా మెరిసిపోతాయి.

Ponnam Prabakar : బరాబర్ మా అయ్య జాగీరే..పవన్ కు పొన్నం కౌంటర్

Exit mobile version