Smart Watch
అడుగుల కౌంటింగ్ నుంచి నిద్ర టైమ్ వరకు.. బాడీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అరచేతిలో చూపించే స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతికి అలంకారంగా మారిపోయాయి. అయితే స్మార్ట్‌వాచ్‌ను చాలామంది రోజంతా, చివరికి పడుకునేటప్పుడు కూడా అలాగే ఉంచేసి పడుకుంటున్నారు.అయితే ఇలా డే అండ్ నైట్ చేతికి వాచ్ పెట్టుకోవడం వల్ల ఏమైనా రేడియేషన్ డేంజర్ ఉందా, అసలు రాత్రిపూట దీన్ని పెట్టుకుని పడుకోవడం సేఫేనా అనే డౌట్స్ చాలామందిలో ఉన్నాయి.
ముందుగా రేడియేషన్ విషయానికి వస్తే, అమెరికా సీడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం భయపడాల్సిన అవసరమేమీ లేదు. స్మార్ట్‌వాచ్(Smart Watch)లు బ్లూటూత్ సిగ్నల్స్ బేస్‌గా పనిచేసే చాలా తక్కువ పవర్ ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాలు. ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి బయటకు వదిలే వైర్‌లెస్ సిగ్నల్స్ చాలా తక్కువ రేంజ్‌లో ఉంటాయి కాబట్టి, వీటి వల్ల బాడీకి క్యాన్సర్ వంటి రేడియేషన్ హాని జరుగుతుందని అనడానికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు.
ఇక రాత్రి సమయంలో స్లీపింగ్ ప్యాటర్న్స్ తెలుసుకోవడానికి వాచ్‌ను వాడడం వల్ల ఎలాంటి డేంజర్ కూడా లేదు. కాకపోతే, వాచ్ చూపించే నిద్ర డేటాను కేవలం ఒక అంచనాగా మాత్రమే చూడాలి కానీ, అదే పక్కా మెడికల్ రిపోర్ట్ అనుకోకూడదు. మీకు నిజంగానే నిద్రపట్టకపోవడం వంటి తీవ్ర సమస్యలుంటే మాత్రం డైరెక్టుగా డాక్టర్‌నే కలవాలి.
అయితే, స్మార్ట్‌వాచ్(Smart Watch)లు పెట్టుకున్న అందరికీ అంతా ఓకే అయినా హార్ట్‌లో పేస్‌మేకర్ లేదా ఇతర ఇంప్లాంటబుల్ డివైసెస్ అమర్చుకున్నవాళ్లు మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కొన్ని స్మార్ట్‌వాచ్‌లలో వాడే మాగ్నిటిక్ పవర్ వీటి పనితీరుకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అందుకే పేస్‌మేకర్ ఉన్న ప్లేస్‌కు, వాచ్‌కి మధ్య కనీసం 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలని యుఎస్ ఎఫ్‌డీఏ వార్నింగ్ ఇస్తోంది.
వీటితో పాటు మన స్కిన్ హెల్త్, నీట్‌నెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి అనుకోవాలి. వాచ్‌ను చాలా టైట్‌గా కట్టేసుకోవడం వల్ల ఆ ప్లేస్‌లో చెమట పట్టి, దద్దుర్లు, దురద లేదా చెమట కాయలు వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకే వాచ్‌ను కాస్త లూజ్‌గా కట్టుకోవడం, డే లో కొంత టైమ్ అయినా గాలి తగిలేలా పక్కన పెట్టడం చాలా మంచిది.
అలాగే బెల్ట్ కింద స్వెట్ ఉండిపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసుకోవడానికి స్మార్ట్‌వాచ్(Smart Watch)లు బాగా హెల్ప్ అవుతాయి దానిలో ఏ డౌట్ లేదు. కాకపోతే ఇవి హాస్పిటల్ టెస్టులకు ఆల్టర్‌నేటివ్ కావన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.
