Special Person
మన లైఫ్‌లో చిన్న సంతోషం వచ్చినా, లేదా బాధలో ఉన్నా.. మన చుట్టూ వంద మంది స్నేహితులు, బంధువులు ఉన్నా సరే మన మనసు ఒకరికి ఆ వార్త చెప్పాలనే అనుకుంటుంది. మన లైఫ్‌లో జరిగే అన్ని విషయాలు అందరికీ చెప్పలేం. కొన్నింటిని చెప్పకుండా దాచేస్తాం, మరికొన్నింటిని పైపైన చెబుతాం.
కానీ అన్ని విషయాలను ఆ ఒక్క వ్యక్తి ముందే పరిచేస్తాం. అసలు మన మైండ్ ఒక పర్సన్‌కి మాత్రమే ఎందుకు చెప్పాలనుకుంటుంది? అందరిలో లేని ఆ స్పెషాలిటీ ఆ ఒక్కరిలోనే మనకు ఎందుకు కనిపిస్తుందనే ప్రశ్న మనలోనే వినిపిస్తుంది.
అయితే హ్యూమన్ సైకాలజీ ప్రకారం దీనిని ఎమోషనల్ కో-రెగ్యులేషన్ అండ్ సేఫ్ హ్యావెన్ థియరీ అని పిలుస్తారు. మన మైండ్ సంతోషంగానో లేదా బాధలో ఉంటూ ఎమోషన్స్‌కు లోనైనప్పుడు, అక్కడ ఒక రకమైన ఎమోషనల్ అగ్రెషన్ లేదా లోడ్ తయారవుతుంది.
ఆ సమయంలో మనిషి నెర్వస్ సిస్టమ్ ఆ భారాన్ని తట్టుకోవడానికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ కోసం వెతుకుతుంది. నిజానికి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో మన రిలేషన్ ఒకేలా ఉండదు. సొసైటీలో బ్రతకడానికి మనం కొందరి ముందు రకరకాల ముసుగులు (Social Masks) వేసుకుంటాం.
ఇలాంటి వారిలో ఎలాంటి జడ్జ్‌మెంట్ లేకుండా, మన బలహీనతలను, సంతోషాలను చూసి నవ్వకుండా, మనల్ని మనలాగా అంగీకరించే ఒక యాక్సెప్టెన్స్ స్పేస్ కేవలం చాలా కొద్ది మంది దగ్గర.. అది కూడా ఒకరిద్దరి దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. అందుకే మనసు మన చుట్టూ ఎంతమంది ఉన్నా.. కేవలం ఆ అలాంటి పర్సన్‌నే తన సేఫ్ జోన్‌గా ఫిక్స్ చేసుకుంటుంది.
ఇక హ్యాపీనెస్‌ను పంచుకోవడానికి సైకాలజీలో క్యాపిటలైజేషన్ అనే ఒక ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. మనకు జరిగిన మంచి విషయాన్ని మనకు నచ్చిన వ్యక్తితో షేర్ చేసినపుడు మన మైండ్‌లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ అవడం రెట్టింపు అవుతుంది. అంటే ఆ హ్యాపీనెస్‌ను పంచుకోవడం వల్ల ఆ సంతోషం రెట్టింపయ్యి మనకు దక్కే తృప్తి, కిక్ వేరే లెవెల్‌కి వెళ్తాయి.
అదే సమయంలో బాధను షేర్ చేసుకున్నప్పుడు మైండ్‌లోని ఆందోళనకు రీజనయ్యే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. మనలోని బాధను మాటల రూపంలో బయటకు చెప్పినప్పుడు (Emotional Venting) మన మైండ్‌లోని ఆలోచనల గందరగోళం తగ్గి, ఒక క్లారిటీ వస్తుంది. మనసు తేలికపడిపోవడానికి అసలు కారణం ఇదే అంటారు సైకాలజిస్టులు.
ఇలా ఒక స్పెషల్ పర్సన్(Special Person)తో ఎమోషన్స్ షేర్ చేసుకోవడం వల్ల మెంటల్‌గానే కాదు, ఫిజికల్‌గా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రస్ట్రేషన్‌తో, ఒత్తిడితో సతమతమయ్యే మన బాడీకి ఆ వ్యక్తితో పంచుకునే విషయాలు ఒక మెడిటేషన్‌లా పని చేస్తుంది.
దీనివల్ల బ్లడ్ ప్రెషర్ నిలకడగా మారడమే కాకుండా హార్ట్ బీట్ ప్రశాంతపడుతుంది. మనకు ఏదైనా కష్టం వస్తే ఓదార్చడానికి, ఆపదలో అండగా నిలవడానికి ఒక మనిషి ఉన్నాడనే ఎమోషనల్ సెక్యూరిటీ మనలో కాన్ఫిడెన్స్‌ను, జీవించే ఉత్సాహాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఆ బాండింగ్ వల్ల మనలో లోన్లీనెస్ (Loneliness) అనే ఫీలింగ్ ఉండదు.
నిజానికి ప్రతీ మనిషికి కూడా బాధలో ఉన్నప్పుడు వారి పక్కన కూర్చుని నేనున్నానని ఓదార్చేవారు, సంతోషంలో ఉన్నప్పుడు నిజంగా హ్యాపీగా ఫీలయ్యేవారు ఒక్కరైనా ఉండటం గొప్ప వరమే అవుతుంది. ఎందుకంటే మనుషులందరితో మాట్లాడటానికి టైమ్, సందర్భం ఉంటే సరిపోతుంది కానీ, ఆ స్పెషల్ పర్సన్(Special Person)తో మన ఫీలింగ్స్ పంచుకోవడానికి మాత్రం రెండు మనసులు ఒకే ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అయితేనే సాధ్యం అవుతుంది. అందుకే మీ జీవితంలో కూడా అలాంటి పర్సన్ ఉంటే వాళ్లను ఎప్పటికీ వదులుకోకండి.
