Strength : కాలర్ ఎగరేయడం, అరవడం కాదు.. రియల్ స్ట్రెంత్ అంటే ఇదే..

Strength : ప్రొటెక్ట్ చేయడం అంటే కేవలం గొడవలకు వెళ్లాలని చెప్పడం కాదు. మీ తోటివారి ఎమోషన్స్‌ను గౌరవించడం అలాగే వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అన్నమాట.

Strength

చాలామంది స్ట్రెంత్ అనగానే ఎదుటివారిపై అరవడం, లేదా అధికారం చూపించి లొంగదీసుకోవడం అనే అనుకుంటారు. ఇంకొందరు అయితే తమ కోపాన్ని, ఆధిపత్యాన్ని పెద్ద మాస్ ఇమేజ్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా తెగ ట్రై చేస్తుంటారు.

అయితే ఇవన్నీ ఆ మనిషి లోపల ఉన్న తీవ్రమైన భయానికి, అభద్రతాభావానికి సంకేతాలే కానీ బలానికి కాదని సైకాలజీ చెబుతుంది. ఒక మనిషిలో ఉండే నిజమైన పవర్ అంటే.. ఎదుటివారిని భయపెట్టడం కాదని, మన చుట్టూ ఉన్నవారికి ప్రొటెక్షన్ అంటే రక్షణ ఇచ్చేలా వారివైపు నిలబడటం అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎదుటివారిని తొక్కి ముందుకు వెళ్లడం బలం కాదని.. బలహీనంగా ఉన్నవారికి చేయి అందించి కాపాడటమే అసలైన రియల్ స్ట్రెంత్(Strength) అని అంటున్నారు.

సైకాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. మెంటల్‌గా వీక్‌గా ఉన్నవారే బయటకు గంభీరంగా ఉన్నట్లుగా నటిస్తూ.. ఇతరులను గాయపరచడానికి చూస్తుంటారు. కానీ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెంటల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ప్రొటెక్ట్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తారు.

మీ ఇంట్లోవాళ్లను, మీపై ఆధారపడిన వారిని అన్ని రకాలుగా కాపాడుకోవడంలోనే మీ అసలైన స్ట్రెంత్(Strength) బయటపడుతుంది. ఎదుటివారి తప్పులను ఆసరాగా తీసుకుని వారిని తొక్కేయకుండా.. వారికి వెన్నుముకగా నిలిచి గెలిపిస్తూ లీడర్‌షిప్ క్వాలిటీని మెరుగుపరుచుకోవాలి.

Strength

ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం అంటే కేవలం గొడవలకు వెళ్లాలని చెప్పడం కాదు. మీ తోటివారి ఎమోషన్స్‌ను గౌరవించడం అలాగే వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అన్నమాట. అంతేకాదు వాళ్లు కిందపడిపోయినప్పుడు నేనున్నాననే భరోసానివ్వడం కూడా ప్రొటెక్ట్ చేయడం కిందకే వస్తాయి.

చేతిలో ఏదైనా ఆయుధం లేదంటే జేబులో డబ్బు ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా పవర్‌ఫుల్ అయిపోరు. ఎవరైతే తమ ఎనర్జీని ఇతరులకు అండగా నిలబడటానికి ఉపయోగిస్తారో, వారే ఈ సొసైటీలో ఉత్తమ స్థానంలో నిలుస్తారు. ఎవరినైనా బెదిరించే బలం కంటే, అందరినీ కాపాడే హృదయమే ఎప్పుడూ గెలుస్తుంది.

Apple Pay : ఇండియాలోకి యాపిల్ పే ఎంట్రీ..కానీ చిన్న ట్విస్ట్ ఉందట..

Exit mobile version