Hair
వేసవి కాలం రాగానే చర్మంపై ఎండ ప్రభావం పడకుండా ఉండటానికి రకరకాల సన్‌స్క్రీన్ లోషన్లు, క్రీములు వాడుతూ ఉంటాం. అయితే అదే ఎండ మన జుట్టును(Hair) కూడా బాగా దెబ్బ తీస్తుందని స్కిన్ స్పెషలిస్టులు అంటున్నారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కేవలం చర్మానికే కాదు, జుట్టు కుదుళ్లకు కూడా బాగానే నష్టం కలిగిస్తాయట.
వేసవిలో ఉండే ఎక్కువ ఉష్ణోగ్రతలు, విపరీతమైన తేమ తల చర్మంపై చెమట ఎక్కువగా పట్టేలా చేస్తాయి. ఈ చెమట వల్ల జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది, దీని వల్ల గాలిలోని దుమ్మ, ధూళి కణాలు జుట్టుకు ఈజీగా అంటుకుంటాయి. ఇది జుట్టును నిర్జీవంగా మార్చడంతో పాటు, కుదుళ్లను బలహీనపరిచి జుట్టు విపరీతంగా రాలడానికి మెయిన్ రీజన్ అవుతుంది.
ముఖ్యంగా స్కాల్ఫ్ (Scalp) అనేది శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా సున్నితమైనది. వేడి, తేమకు ఇది చాలా వేగంగా రియాక్టవుతుంది. సూర్యరశ్మి డైరక్టుటా స్కాల్ఫ్‌పై పడటం వల్ల అక్కడ తేమ తగ్గిపోయి పొడిబారడం, మంట పుట్టడం అలాగే దురద వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో బ్యాక్టీరియా , ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరిగి చుండ్రు సమస్య మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది.
కాబట్టి సమ్మర్‌లో జుట్టు సంరక్షణ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా చాలా ముఖ్యం. నిపుణుల సూచనల ప్రకారం, వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి మిగిలిన అన్ని సీజన్లలో కంటే సమ్మర్‌లో ఎక్కువగా జుట్టు శుభ్రతపై దృష్టి పెట్టాలి.
ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి తప్పనిసరిగా హెడ్ బాత్ చేయాలి. దీని వల్ల తల చర్మంపై పేరుకున్న జిడ్డు, చెమట , మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లు శ్వాస తీసుకోగలగడంతో.. జుట్టు తాజాగా ఉంటుంది. అలాగే బయట ఎండలోకి వెళ్లే సమయంలో తలకు డైరెక్టుగా ఎండ తగలకుండా వెడల్పాటి అంచు ఉన్న టోపీలు , కాటన్ స్కార్ఫ్‌లను ధరించాలి. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేసి సూర్యరశ్మి నుంచి జుట్టు రంగు మారకుండా , తేమ కోల్పోకుండా కాపాడుతుంది. ఒకవేళ తలలో విపరీతమైన దురద, ఇన్ఫెక్షన్ కనిపిస్తే, స్కిన్ కేర్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
అయితే కేవలం ఇలా పైపైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు, లోపలి నుంచి కూడా హెయిర్‌కు పోషణ అందాలి. సమ్మర్‌లో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. దీనికోసం రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల మంచి నీళ్లు త్రాగాలి. తాజా పండ్లు, ఆకుకూరలు , పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు లోపలి నుంచి స్ట్రాంగ్‌గా మారుతాయి. కెమికల్స్‌తో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం తగ్గించి, నేచురల్ మెథడ్స్ ఉపయోగించి ఈ సీజన్లో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చును.
Self Enumeration : సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ప్రారంభం..మే 10 వరకు అవకాశం
