Transparency
ప్రేమ లేదా పెళ్లి బంధంలో చాలామంది సగం సగం నిజాలు చెప్పడం.. అసలు విషయాన్ని దాచిపెట్టడం అనే సన్నని గీతపై ఏదొక సందర్భంలో ఊగిసలాడటం కామన్‌గా జరుగుతుంది. ఇలాంటి వాళ్లు ..నేను అబద్ధం అయితే చెప్పలేదు కదా, కొన్ని విషయాలు మాత్రమే దాచానని మనస్సాక్షిని సమాధానపరుచుకోవడానికి ట్రై చేస్తుంటారు.
కానీ సైకాలజీ ప్రకారం ఇన్‌కంప్లీట్ హానెస్టీ లేదా ఇలా సగం నిజాలు చెప్పడం కూడా రిలేషన్‌లో పూర్తి అబద్ధంతో సమానమైన డ్యామేజ్‌నే కలిగిస్తుంది. పార్ట్‌నర్‌కి ప్రశాంతత ఇవ్వడం కోసమో, గొడవలు కాకూడదనే ఉద్దేశంతోనో కొన్ని విషయాలు దాచడం అప్పటికి మంచిదే అనిపించొచ్చు.
కానీ ఒకసారి నిజం బయటపడ్డాక, ఆ దాచడమే వారిద్దరి బంధంలో అనుమానానికి బీజం వేస్తుంది. అప్పటివరకు ఉన్న నమ్మకం ఒక్కసారిగా ఆవిరైపోవడంతో అప్పటి నుంచి పార్ట్‌నర్ చేసిన ప్రతీ చిన్న విషయాన్ని ప్రశ్నించడం, ప్రతి కదలికను అనుమానించడం మొదలుపెడతారు.
ఇలా సగం నిజాలు దాచే అలవాటును సైకాలజీలో విత్‌హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ అని పిలుస్తారు. అంటే ఎవరైనా తమ తప్పునో, గతానికి సంబంధించిన కఠిన నిజాలనో దాయడానికి ప్రయత్నించినప్పుడు, అది వారిలోని భయానికి, సెల్ఫ్ ప్రొటెక్షన్ ధోరణికి సంకేతం.
అంటే నిజం చెబితే ఎక్కడ పార్ట్‌నర్ వదిలేస్తారో, లేదా తన మీద ఎక్కవ ప్రేమ తగ్గిపోతుందోననే భయంతోనే చాలామంది కొన్ని విషయాలను కప్పిపుచ్చుతారు. అయితే సైకాలజిస్టులు చెబుతున్నదాని ప్రకారం, క్లియర్ కమ్యూనికేషన్ , పూర్తి ట్రాన్స్‌పరెన్సీ(Transparency) కూడా ప్రేమలో ఒక భాగమే. నిజాలను దాచడంలో కాకుండా, వాటిని ఎంతో నిజాయితీగా చెప్పడంలోనే పార్ట్‌నర్‌పై ఉన్న గౌరవం బయటపడుతుంది. ఎందుకంటే ఇలాంటి కారణాలతో వారిద్ధరి మధ్య ఒక్కసారి నమ్మకం పోయిందంటే..అక్కడ ప్రేమ ఎక్కువ కాలం నిలబడలేదు.
అయితే ఇక్కడే ఒక పెద్ద డౌట్ అందరిలో కలుగుతుంది. ప్రతీ చిన్న విషయాన్ని, లేదా పార్ట్‌నర్‌ని బాధపెట్టే నిజాలను ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల ఆ రిలేషన్ విరిగిపోతుంది కదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇదే సమయంలో బాధపెట్టే నిజాలు చెప్పడం కంటే వాటిని చెప్పకపోవడమే బెటర్ అని వాదించే వారి మాటల్లో కూడా కొంత నిజం ఉంది.
దీనికి సైకాలజీ ఒక చక్కని సొల్యూషన్ చూపిస్తుంది. ఆర్టిఫిషియల్ లేదా డిప్లొమాటిక్ దాచడం కాకుండా, టైమింగ్ అండ్ ఎంపతీ చాలా ముఖ్యం. అంటే నిజాన్ని ఎవరినో బ్లేమ్ చేసేలా కాకుండా, ఎమోషనల్‌గా, నేర్పుగా చెప్పాలి. గతంలో జరిగిన పొరపాట్లను, బాధాకరమైన విషయాలను చెబుతూనే.. ఇప్పుడు మీలో వచ్చిన మార్పును, పార్ట్‌నర్ పట్ల తమ కున్న కమిట్‌మెంట్‌ను క్లియర్‌గా వివరించాలి.
మొత్తంగా పెళ్లిలోనూ, భాగస్వామ్యంలోనూ కావాల్సింది పర్ఫెక్ట్ మనుషులు కాదని.. ట్రాన్స్‌పరెన్సీ(Transparency)గా ఉండే మనసులు అని ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాలి. ఇలా ప్రతి చిన్న విషయాన్ని దాచుకుంటూ పోతే మైండ్‌లో తెలీని ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆందోళన ఎక్కువవుతుంది.
నిజం కాస్త చేదుగా ఉన్నా కూడా మొదట్లోనే దాన్ని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీని పార్ట్‌నర్‌కు ఇవ్వడమే నిజమైన ప్రేమ అని తెలుసుకోవాలి. దాచడం వల్ల లభించే టెంపరరీ ప్రశాంతత కంటే, నిజాయితీ వల్ల దక్కే లైఫ్ లాంగ్ నమ్మకమే బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందన్న విషయాన్ని గ్రహించాలి.
Astrology : జాతకం ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదా.. ఈ 4 సందర్భాల్లోనే చూపించాలా?
