Weekend : 24 గంటల మైక్రో ట్రిప్స్.. వీకెండ్‌లో రీఛార్జ్ అవ్వడానికి సరికొత్త ట్రెండ్

Weekend : వారమంతా ఒకే రకమైన రొటీన్ లైఫ్‌తో అలసిపోయిన వారికి ఈ మధ్య మైక్రో ట్రిప్స్ అనే కొత్త ట్రెండ్ బాగా నచ్చేస్తోంది. అసలు ఈ మైక్రో ట్రిప్స్ కాన్సెప్ట్ ఏంటి, దీనివల్ల లాభాలేంటి, తక్కువ టైమ్‌లో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.

Weekend

వారమంతా ఒకే రకమైన రొటీన్ లైఫ్‌తో అలసిపోయిన వారికి ఈ మధ్య మైక్రో ట్రిప్స్ అనే కొత్త ట్రెండ్ బాగా నచ్చేస్తోంది. సాధారణంగా ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆఫీసులో లీవులు, హోటల్ బుకింగ్స్, బడ్జెట్.. ఇలా ఎన్నో విషయాలను చూసుకోవాలి.

కానీ ఈ మైక్రో ట్రిప్స్ కాన్సెప్ట్ మాత్రం పూర్తిగా భిన్నమైనది. శనివారం ఉదయం ఇంటి నుంచి స్టార్ట్ అయి ఆదివారం సాయంత్రానికల్లా మళ్లీ ఇంటికి వచ్చేసేలా ఈ టూర్‌ను డిజైన్ చేసుకుంటారు. ఎలా అంటే ఇంటికి ఒక వంద , నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏదైనా ఒక కొత్త ప్లేస్‌ను ఎంచుకుని, అక్కడ కేవలం 24 గంటలు గడపడమే ఈ ట్రిప్ మెయిన్ ఉద్దేశం.

ఈ మైక్రో ట్రిప్స్ వల్ల లభించే అతిపెద్ద లాభం ఏంటంటే టైమ్ అండ్ మనీ సేవ్ అవ్వడం. దీని కోసం ప్రత్యేకంగా లీవులు పెట్టాల్సిన అవసరం ఉండదు. లాంగ్ ట్రిప్స్ వెళ్లినప్పుడు బస్సు ప్రయాణాల్లో, ఫ్లైట్లలోనే సగం టైమ్ వేస్ట్ అయిపోతుంది, తిరిగి వచ్చేసరికి బాడీ మరింతగా అలసిపోతుంది.

కానీ మైక్రో ట్రిప్స్‌లో జర్నీ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మనకు నచ్చిన ప్లేస్‌లో ప్రశాంతంగా గడపడానికి ఎక్కువ టైమ్ దొరుకుతుంది. అందుకే దీనిని తక్కువ ఖర్చుతో ఎక్కువ రిఫ్రెష్‌మెంట్‌ను ఇచ్చే టూర్‌గా చెబుతారు.

దీనికోసం మన ఇంటికి కాస్త దూరంలో ఉండే రిసార్ట్స్, హిస్టారికల్ ప్లేసెస్, ప్రకృతి రమణీయత ఉట్టిపడే జలపాతాలు లేదా ఏదైనా ఒక పీస్‌ఫుల్ విలేజ్ అట్మాస్పియర్‌ను ఎంచుకోవచ్చు.

వీకెండ్‌(Weekend)లో ఒక రోజు ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ కాల్స్‌కు పూర్తిగా దూరంగా ఉండే ఈ డిజిటల్ డిటాక్స్‌తో పాటు కేవలం ప్రకృతి ఒడిలో గడపడం వల్ల మైండ్ చురుగ్గా మారుతుంది. కొత్త ప్లేసెస్‌ చూడటం, అక్కడి లోకల్ ఫుడ్‌ను టేస్ట్ చేయడం వల్ల మనసుకు తెలీని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Weekend

భారీ లగేజీలు సర్దుకునే పని లేకుండా, ఒక చిన్న బ్యాగ్‌తోనే జర్నీ చేస్తూ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లడం దీనికి ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు. పైగా సోమవారం ఆఫీస్‌, లేదా రొటీన్ పనుల్లో జాయిన్ అయ్యాక కొత్త ఉత్సాహంతో పని చేయగలుగుతారు.

నిజానికి వారమంతా కష్టపడే బాడీకి, మనసుకు వీకెండ్‌(Weekend)లో ఇలాంటి ఒక స్మాల్ బ్రేక్ ఇవ్వడం చాలా అవసరం. అందుకే ఈసారి వీకెండ్ వచ్చినపుడు ఇంట్లోనే కూర్చుని టీవీలు, మొబైల్స్ చూస్తూ టైమంతా వేస్ట్ చేయకుండా.. మీకు దగ్గర్లో ఉన్న ఒక అందమైన ప్లేస్‌కు 24 గంటల మైక్రో ట్రిప్ ప్లాన్ చేయండి.

Sleep : వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోవడం నిజంగా హెల్దీనా? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న నిజాలు..

Exit mobile version