INFJ Personality : మీరు కూడా INFJ పర్సనాలిటీకి చెందిన వారేనా?

INFJ Personality : ఈ INFJ పర్సనాలిటీ ఉన్నవాళ్లలో ఉండే ఆరితేరిన పరిశీలనా శక్తి అంటే అబ్జర్వేషన్ కెపాసిటీ చూస్తే..మీకు మైండ్ బ్లాక్ అవుతుంది.

INFJ Personality

ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనుషులలో అందరి ఆలోచనలు, మనస్తత్వాలు ఒకేలా ఉండవు. కొందరి ప్రవర్తన చాలా డిఫరెంట్‌గా అర్థం కానట్లుగా ఉంటుంది. సైకాలజీ ప్రకారం మానసిక స్వభావాన్ని కొలిచే ..మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ (MBTI) టెస్ట్‌లో 16 రకాల పర్సనాలిటీలు ఉంటే.. అందులో అత్యంత అరుదైనది, విచిత్రమైనది మాత్రం INFJ పర్సనాలిటీ(INFJ Personality) అంటారు సైకాలజిస్టులు.

ప్రపంచ జనాభా మొత్తంలో చూసుకుంటే కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే ఈ పర్సనాలిటీ ఉంటుంది. సైకాలజిస్టులు వీళ్లను ది అడ్వకేట్ లేదా ది కౌన్సెలర్ అని పిలుస్తారు. ఇలాంటి వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే మీరు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులైనా అయి ఉండాలి, లేదా చాలా పెద్ద డేంజర్‌లో అయినా ఉండి ఉండాలని అంటున్నారు సైకాలజిస్టులు.

నిజానికి ఈ INFJ అనే నాలుగక్షరాల వెనుక ఒక పెద్ద సైకాలజీనే దాగి ఉంది. I మీన్స్ ఇంట్రోవర్ట్ అంటే ఆలోచనలు తమలోనే ఉంచుకుంటూ ప్రశాంతతను కోరుకునేవారు అన్నమాట. ఇక N మీన్స్ ఇంట్యూటివ్ అంటే కంటికి కనిపించే విషయాల కంటే కూడా లోతైన అర్థాలను, అంతరాత్మ మాటను నమ్మేవారు.

అలాగే F మీన్స్ ఫీలింగ్ అంటే నిర్ణయాల కంటే కూడా మానవత్వానికి, ఎదుటివారి భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక ఫైనల్‌గా J మీన్స్ జడ్జింగ్ అంటే ప్రతీ విషయంలో పక్కా ప్లానింగ్, లైఫ్‌లో క్లారిటీ కోరుకునేవారు అన్నమాట. ఈ నాలుగు లక్షణాలు ఒక్కరిలోనే ఉండటం చాలా అరుదని సైకాలజిస్టులు అంటున్నారు.

ఈ పర్సనాలిటీ(INFJ Personality) ఉన్నవాళ్లలో ఉండే ఆరితేరిన పరిశీలనా శక్తి అంటే అబ్జర్వేషన్ కెపాసిటీ చూస్తే..మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. వీళ్లు నడిచే లై డిటెక్టర్ మిషన్ వంటివారు. మీరు వీళ్ల ముందు నిలబడి ఏ చిన్న అబద్ధం చెప్పినా, చెప్పకుండా నాటకాలు ఆడినా సెకన్లలోనే పసిగట్టేస్తారు. సైకాలజీలో దీనినే ఇంట్రోవర్టెడ్ ఇంట్యూషన్ అంటారు. అంటే మీరు వారి ముందు నోరు విప్పకపోయినా కూడా మీ మనసులో ఏం నడుస్తుందో మీ కళ్లను, ప్రవర్తనను చూసి ముందే వారు గ్రహించేస్తారు.

ఇక వీరిలో ఉన్న ప్రేమాభిమానాల విషయానికి వస్తే.. మిమ్మల్ని మనస్ఫూర్తిగా కనుక ఒకసారి నమ్మితే మీ కోసం ఎలాంటి త్యాగానికైనా, ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. కానీ ఒక్కసారి మీరు వీళ్లకు ద్రోహం చేసినట్లు కానీ, నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కానీ తెలిస్తే వీళ్లలోని అత్యంత ప్రమాదకరమైన INFJ డోర్ స్లామ్ (Door Slam) అనే సైలెంట్ కోణం బయటపడుతుంది.

INFJ Personality

ఈ డోర్ స్లామ్ ఒకసారి పడిందంటే ఇక అంతే సంగతులు. వీళ్లు మీతో ఎలాంటి గొడవపడటం, కేకలు వేయడం, పగ తీర్చుకోవడానికి ప్లాన్స్ వేయడం వంటివి ఏం కూడా చేయరు. చాలా సైలెంట్‌గా, క్షణాల్లోనే మిమ్మల్ని తమ లైఫ్ నుంచే కాదు..వారి జ్ఞాపకాల నుంచి కూడా శాశ్వతంగా తుడిచి పెట్టేస్తారు.

ఆ తర్వాత అవతలి వ్యక్తి ఎంత ఏడ్చినా, కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కూడా మళ్లీ మిమ్మల్ని తమ దగ్గరలోకి కూడా రానివ్వరు. మీ మైండ్‌ను కూడా చదవగల ఇలాంటి సైలెంట్ మాస్టర్ మైండ్లు మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో కానీ మీ ఇంట్లో కానీ ఉన్నారా లేదంటే మీరే అలాంటి పర్సనాలిటీ(INFJ Personality)తో ఉన్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.

Relatives : రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నారా? ఎంత ఆత్మీయులైనా సరే ఈ హద్దులు దాటకండి..

↑
Exit mobile version