Slow Dating : డేటింగ్ యాప్‌ల కల్చర్‌కు చెక్.. ట్రెండ్‌లో స్లో డేటింగ్

Slow Dating : డేటింగ్ యాప్‌లలో కేవలం ఫోటోలు చూసే పద్ధతికి కొద్దిగా దూరంగా ఉంటూ, అవతలి వ్యక్తి ప్రొఫైల్, వారి ఇంట్రస్ట్‌లు, ఆలోచనలు ఏంటో కాస్త మెల్లగా అర్థం చేసుకోవాలి.

Slow Dating

నిత్యం గజిబిజి లైఫ్‌లు, ఫోన్ స్క్రీన్‌పై లెఫ్ట్‌కు,రైట్‌కు స్వైప్ చేస్తూ నచ్చిన పార్ట్‌నర్‌ను వెతికే డేటింగ్ యాప్‌ల కల్చర్‌కి నేటి యూత్ మెల్లమెల్లగా బ్రేక్ వేస్తోంది. కేవలం చాటింగ్ చేయడం, ఒకే ఒక్క మీటింగ్‌లో అన్నీ డిసైడ్ చేయడం వంటి హడావుడి పద్ధతులకు స్వస్తి పలుకుతూ స్లో డేటింగ్(Slow Dating) అనే కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. మెల్లగా పరిచయాలను పెంచుకోవడం, అవతలి వ్యక్తి మెంటాలిటీని లోతుగా అర్థం చేసుకోవడం, తొందరపాటు నిర్ణయాలకు బై చెప్పడమే ఈ కల్చర్ ముఖ్య ఉద్దేశం. మోడర్న్ లైఫ్‌లో హ్యూమన్ రిలేషన్‌ మధ్య ఉన్న ఒత్తిడి నుంచి మనసును కాపాడుకోవడానికి చాలామంది ఇప్పుడు ఈ స్లో డేటింగ్‌ను ఎంచుకుంటున్నారు.

ఈ స్లో డేటింగ్(Slow Dating) విధానాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లో అప్రోచ్ అవ్వడం చాలా సింపుల్ అనే ఫీలవుతున్నారు. డేటింగ్ యాప్‌లలో కేవలం ఫోటోలు చూసే పద్ధతికి కొద్దిగా దూరంగా ఉంటూ, అవతలి వ్యక్తి ప్రొఫైల్, వారి ఇంట్రస్ట్‌లు, ఆలోచనలు ఏంటో కాస్త మెల్లగా అర్థం చేసుకోవాలి. పరిచయమైన రోజే గంటల కొద్దీ చాట్ చేసుకోవడం, వెంటనే ఒకరి పర్సనల్ విషయాలు మరొకరికి షేర్ చేసుకోవడంలాంటి తొందరపాటు పద్ధతులకు స్వస్తి చెప్పి కాన్వర్సేషన్‌ను నేచరల్‌గా పెంచుకోవాలి. వర్చువల్ వరల్డ్ నుంచి బయటికి వచ్చి, ఒకరినొకరు డైరెక్టుగా కలుసుకోవడానికి తగినంత టైమ్‌కు కేటాయించాలి.

ఈ స్లో డేటింగ్ వెనుక పెద్ద సైకాలజీనే దాగి ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చాలా ఫాస్టుగా సాగే డేటింగ్‌లో బ్రెయిన్‌లోని ఉత్సాహాన్నిచ్చే డోపమైన్ హార్మోన్ టెంపరరీగా మాత్రమే వర్క్ చేస్తుంది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే ఆ రిలేషన్‌పై ఇంట్రస్ట్ తగ్గిపోయి, మళ్లీ కొత్త వెతుకులాట మొదలవుతుంది.

కానీ, స్లో డేటింగ్‌లో ఇలా కాకుండా ఒకరినొకరు మెల్లగా అర్థం చేసుకోవడం వల్ల..వారిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ బలపడుతుంది. తొందరపడి ఒకరిపై ఒకరు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుకోకపోవడం వల్ల ఫ్యూచర్‌లో వచ్చే మనస్పర్థలు, మెంటల్‌ టెన్షన్‌ చాలావరకు తగ్గుతాయని సైకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.

కాలం మారుతున్న కొద్దీ ప్రేమ ఫౌండేషన్ కూడా మారాలని నేటి జనరేషన్ కోరుకుంటోంది. గంటల కొద్దీ ఫోన్లలో చాట్ చేయడం కంటే, కలిసి కాఫీ తాగడం, అభిప్రాయాలను షేర్ చేసుకోవడం, ఒకరి బిహేవియర్‌ను మరొకరు గమనించడానికి టైమ్‌ కేటాయించడం ఈ డేటింగ్ స్టైల్ స్పెషాలిటీ. రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు పడటం కంటే.. ఆచితూచి స్టెప్ వేయడమే బెటర్ అని భావిస్తున్న ఈ ట్రెండ్.. ఇప్పటి డిజిటల్ యుగంలో రిలేషన్‌షిప్‌లకు నయా మీనింగ్‌ చెబుతుందనే ఫీల్‌ను మరింత పెంచుతుంది.

Parallel Conversations : బంధాలలో పారలల్ కాన్వర్సేషన్స్..మీ సంభాషణలో ఈ పొరపాట్లు జరుగుతున్నాయా?

↑
Exit mobile version