Sugarcane Mindset : డేటింగ్ వరల్డ్‌ని షేక్ చేస్తున్న షుగర్ కేన్ మైండ్‌సెట్..ఏంటీ డేంజర్ రిలేషన్‌షిప్ ?

Sugarcane Mindset : మనం చెరకు గడని నమిలి ఆ తీపి రసాన్ని మింగి.. పిప్పిని డస్ట్‌బిన్‌లో వేస్తాం . సరిగ్గా కొంతమంది మనుషులు కూడా ఎదుటివారితో ఇలాగే బిహేవ్ చేస్తున్నారు.

Sugarcane Mindset

లైఫ్ లాంగ్ తోడుంటానని మాటలు చెప్పడం, రోజంతా మెసేజ్‌లతో మురిపెంగా ముంచెత్తడం, ఫ్యూచర్‌ గురించి చెబుతూ ఊహల లోకంలో విహరించేలా చేయడం.. కానీ సీన్ కట్ చేస్తే, కొద్ది రోజులకే అసలు వాళ్లెవరో తెలీనట్టుగా ఫేస్ తిప్పేసుకోవడం. రీసెంట్‌గా డేటింగ్ అండ్ రిలేషన్‌షిప్‌ ప్రపంచాన్ని ఈ డేంజరస్ సైకాలజీ ట్రెండ్ వణికిస్తుంది. దీన్నే షుగర్ కేన్ బిహేవియర్ అని మానసిక నిపుణులు పిలుస్తున్నారు.

అసలేంటీ షుగర్ కేన్ బిహేవియర్(Sugarcane Mindset) అంటే.. మనం చెరకు గడని నమిలి ఆ తీపి రసాన్ని మింగి.. పిప్పిని డస్ట్‌బిన్‌లో వేస్తాం . సరిగ్గా కొంతమంది మనుషులు కూడా ఎదుటివారితో ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. అవతలి వారి నుంచి ఎమోషన్స్‌ను, టైమ్‌ని, డబ్బులను తమకు కావాల్సినంత వరకు వాడుకుని..తమ పని అయిపోయాక ఏమాత్రం గిల్ట్ లేకుండా లైఫ్‌ నుంచి తీసి పారేస్తున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వల్ల.. రొటీన్ లైఫ్‌లోకి ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్, అంటే తక్షణ సంతోషం అనే కాన్సెప్ట్ బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు రిలేషన్ అంటే లైఫ్‌టైమ్ కమిట్‌మెంట్ అనుకునేవారు. కానీ ఇప్పుడు అవసరం, గ్లామర్, ఫిజికల్ అట్రాక్షన్ , ఎమోషనల్ సపోర్ట్, ఫైనాన్సియల్ సపోర్ట్.. ఇలా తమకి వారి నుంచి ఏం కావాలో అది దక్కేంతవరకు ఎదుటివారితో చాలా స్వీట్‌గా ఉంటారు. తమ అవసరం తీరిపోగానే లేదంటే ఆ మనిషి వల్ల ఇక ఎలాంటి లాభం లేదని తెలిసాక చెరకు పిప్పిలా తమ లైఫ్ నుంచి విసిరికొడతారు.

ఈ బిహేవియర్ వల్ల అవతలి పార్ట్‌నర్‌ పట్ల ఆబ్జెక్టిఫికేషన్ జరుగుతోంది. అంటే ఎదుటి మనిషిని మనసు, ఆలోచనలు ఉన్న ఒక మనిషిలా కాకుండా, తమ అవసరాలు తీర్చే ఒక రిసోర్స్‌లా లేదంటే ఒక ఆబ్జెక్ట్‌లా మాత్రమే చూస్తున్నారు. దీనివల్ల బంధాల్లో డెప్త్, బాండింగ్ అనేవి లేకుండా పోతున్నాయి.

నిజానికి ఇలా షుగర్ కేన్ అటాక్‌కి బలైపోయిన విక్టిమ్స్ ..చాలా ఎమోషనల్ బర్న్‌అవుట్‌కి గురవుతున్నారు. తనను కేవలం వారి స్వార్థానికి వాడుకుని వదిలేశారా అనే థాట్ వాళ్ల ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. తనమీద తనకే నమ్మకం పోవడంతో.. లైఫ్‌లో మళ్లీ మంచి వ్యక్తి వచ్చినా కూడా వారిని నమ్మలేనంతగా ట్రస్ట్ ఇష్యూస్ పెరిగిపోతాయి.

ఈ టైప్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లలో చాలా మంది హఠాత్తుగా మాయమైపోయే ఘోస్టింగ్ కల్చర్‌ని ఫాలో అవుతారు. అసలు ఎలాంటి రీజన్ చెప్పకుండా, మెసేజ్‌కి రిప్లై ఇవ్వకుండా కాంటాక్ట్స్ కట్ చేసేసి సడన్‌గా వెళ్లిపోతారు. ఎదుటివారి మానసిక వేదనతో వీరికి ఎలాంటి సంబంధం ఉండదు.

Sugarcane Mindset

అయితే ఇక్కడే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇలా ఎదుటివారిని వాడుకుని వదిలేసే వ్యక్తులకు తమ లైఫ్‌లో కూడా ప్రశాంతత దక్కదు. ఎందుకంటే వాళ్లెప్పుడూ కొత్త ఎమోషనల్ రసం కోసం కొత్త పర్సన్స్‌ను అన్వేషిస్తూనే ఉంటారు తప్ప.. ఏ ఒక్కరితోనూ నిజమైన, ప్రశాంతమైన బంధం తాలూకా అనుభవాన్ని ఎప్పటికీ పొందలేరు. వారి మనసులో ఎప్పుడూ కూడా ఒకలాంటి శూన్యత అలానే ఉండిపోతుంది.

అందుకే మనుషులు ఎప్పుడూ కూడా ఒకరికొకరు సపోర్ట్‌గా నిలబడాలి తప్ప, అవసరం తీరిపోగానే పారేసే యూజ్ అండ్ త్రో వస్తువులుగా మారకూడదు. ఈ డిజిటల్ యుగంలో చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతున్న ఇలాంటి టాక్సిక్ కల్చర్‌ని .. తొందరగా గుర్తించి, నిజాయితీగా ఉండే పర్సన్‌ను గుర్తించేలా అవగాహన పెంచుకోవాలి.

Check Laziness : పని చేయాలన్నా బద్ధకంగా ఉందా? 5 జపనీస్ సీక్రెట్ టెక్నిక్స్ ట్రై చేయండి..

Exit mobile version