Tai Chi Walk
వేగంగా వాకింగ్ చేస్తేనే అది వాకింగ్ అని అనుకుంటాం. గంటల తరబడి స్పీడ్‌గా పరిగెత్తడం, లేదా వేగంగా నడవడం వల్ల ఈ రోజుల్లో చిన్న వయసులోనే కాళ్ల నొప్పుల బారిన పడినవారిని చూస్తూనే ఉన్నాం. అయితే చైనాకు చెందిన ఒక ప్రాచీన విధానం నుంచి వచ్చిన తాయ్ చి వాక్ ఇప్పుడు అందరి దృష్టిని మెయిన్‌గా ఆకర్షిస్తోంది.
కాళ్లపై అసలు ఎలాంటి ఒత్తిడి పడకుండా, శరీరాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా, మెల్లగా నడుస్తూనే బాడీ మొత్తానికి మంచి ఎనర్జీని ఇచ్చే ఈ తాయ్ చి వాక్(Tai Chi Walk) సీక్రెట్ ఏంటన్న విషయంపై నెట్టింట వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు.
తాయ్ చి వాకింగ్ స్టైల్ అంతా చైనీస్ తత్వశాస్త్రమైన యిన్ యాంగ్ సూత్రంపైనే నడుస్తుంది. అంటే ఒక కాలును తేలికగా ఉంచుతూ (యిన్), ఇంకో కాలుపై బాడీ వెయిట్ మోపడం (యాంగ్) అన్నమాట. నడిచేటప్పుడు ఎలాంటి హడావుడి కూడా లేకుండా, ముందుగా ఒక కాలిపై బ్యాలెన్స్ నిలబెట్టి రెండో కాలును మెల్లగా గాల్లోకి లేపాలి.
ఆ తర్వాత పాదం మడమ భాగంతో ఫ్లోర్‌ను తాకించి, ఆ తర్వాత మెల్లగా పాదాన్ని మొత్తం నేలమీదకు దించాలి. ఇలా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు మనం పీల్చే శ్వాసపై, కాళ్ల కదలికలపై మన మనసును లగ్నం చేయడమే దీనిలో మేజర్ ట్రిక్. కీళ్లపై అనవసర ఒత్తిడి పడకుండా, బాడీ వెయిట్‌ను ఒక కాలి నుంచి మరో కాలికి స్మూత్‌గా మార్చడంలోనే దీనిలోని అసలైన మ్యాజిక్ అంతా ఉంది.
మనసును,బాడీని ఒకే లైన్లోకి తెచ్చే ప్రాక్టీస్ కాబట్టి దీనివల్ల బ్రెయిన్ ఫోకస్, ఏకాగ్రత విపరీతంగా పెరుగుతాయని చైనీయులు నమ్ముతారు. ఇది ఒక మైల్డ్ ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లా పనిచేసి బ్లడ్ సప్లైని, ఊపిరితిత్తుల కెపాసిటీని బూస్ట్ చేస్తుంది.
ఏదైనా అనారోగ్యం , యాక్సిడెంట్ వంటి వల్ల బెడ్ రెస్ట్ తీసుకుని, మళ్లీ బాడీని యాక్టివేట్ చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అని డాక్టర్లు కూడా చెబుతున్నారు. రన్నింగ్ , బ్రిస్క్ వాకింగ్‌లో లాగా కాళ్లకు జెర్క్‌లు పడకపోవడం వల్ల ఒత్తిడి తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది.
ముఖ్యంగా నడుము నొప్పులు, కాళ్ల నొప్పులతో బాధపడేవారికి, వయసైన వారికి ఈ తాయ్ చి వాక్(Tai Chi Walk) చాలా బాగా ఉపయోగపడుతుంది. వాకింగ్ నెమ్మదిగా ఉండటం వల్ల కిందకు జారి పడిపోయే ప్రమాదం ఉండదు.
అయితే ఈ నడకను కేవలం ఆన్‌లైన్ వీడియోలు చూసి సొంత ప్రయోగాలు చేయకూడదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. హిప్ జాయింట్లను ఎలా ఫ్రీగా ఉంచాలి, శరీర బరువును ఎలా బ్యాలెన్స్ చేయాలో సరైన గైడెన్స్ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కాళ్ల సమస్యలున్నవాళ్లు నిపుణులు , ట్రైనర్స్ సమక్షంలోనే దీన్ని నేర్చుకోవాలి.
Ghee : నెయ్యి తింటే లావవుతారా? లేక హెల్త్‌కు బూస్ట్ అవుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
