Last Word : ప్రతి గొడవలోనూ గెలవాలనుకుంటున్నారా? లాస్ట్ వర్డ్ మీదే అవ్వాలన్న మైండ్‌సెట్ ఎందుకు?

Last Word : ఎదుటి వ్యక్తి చివరి మాట చెప్పి సంభాషణను ముగిస్తే.. తాము ఆ ఆర్గ్యుమెంట్‌లో ఓడిపోయామని, తమపై ఎదుటివారి డామినేషన్ పెరిగిపోతోందని కొంతమంది టెన్షన్ పడతారు.

Last Word

మనుషులన్నాక వారి మధ్య చర్చలు, ఆర్గ్యుమెంట్స్ జరగడం చాలా కామన్. ఒక విషయంపై ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఒకరి అభిప్రాయాలను మరొకరు వ్యతిరేకించడం కూడా కామనే. అయితే కొంతమంది మాత్రం.. ఎలాంటి వాదనలోనైనా, ఎవరితో గొడవ పెట్టుకున్నా సరే చివరి మాట (Last Word) ఎప్పుడూ తమదే కావాలని గట్టిగా పట్టబడుతుంటారు.

ఎదుటి వ్యక్తి ఎంత నచ్చజెప్పినా వినకుండా, గొడవ తమ మాటతోనే ఎండ్ అవ్వాలని పట్టుబడతారు. సైకాలజీ ప్రకారం ఇలాంటి బిహేవియర్ కేవలం ఒక మొండితనం మాత్రమే కాదు, దీని వెనుక ఒక విలక్షణమైన మానసిక స్థితితో పాటు కొన్ని బలహీనతలు దాగి ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ప్రతి విషయంలోనూ చివరి మాట తమదే కావాలనుకునే వారిలో కంట్రోల్ ఫ్రీక్ (Control Freak) మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే తమ చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు, సంభాషణలు అన్నీ కూడా ఎప్పుడూ తమ కంట్రోల్‌లోనే ఉండాలని వీరు ఆరాటపడతారు.

చర్చ ఎటు నుంచి ఎటువైపు వెళ్లినా కూడా ఎండింగ్ మాత్రం తాము అనుకున్నట్లే అవ్వాలని భావిస్తారు. ఒకవేళ ఎదుటి వ్యక్తి చివరి మాట(Last Word) చెప్పి సంభాషణను ముగిస్తే.. తాము ఆ ఆర్గ్యుమెంట్‌లో ఓడిపోయామని, తమపై ఎదుటివారి డామినేషన్ పెరిగిపోతోందని వీరు లోపల టెన్షన్ పడతారు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే వారు గట్టిగా అరుస్తూనో.. ఏదొక మాట విసురుతూనో లాస్ట్ వర్డ్(Last Word) తమదే అయ్యేలా చూసుకుంటారు.

దీనికి మరొక మెయిన్ రీజన్ వారిలో ఉండే ఇన్‌సెక్యూరిటీ (Insecurity) ఫీలింగ్. పైకి ఎంత గంభీరంగా, అహంకారంతో కనిపిస్తున్నా.. లోపల మాత్రం తామెక్కడ తక్కువైపోతామో అనే ఇన్సెక్యూరిటీ వీరిని వేధిస్తుంటుంది. తమ ఆలోచనలకు లేదా తమ వ్యక్తిత్వానికి సొసైటీలో సరైన గుర్తింపు లేదేమోననే అనుమానం వీరిలో ఉంటుంది.

అందుకే ప్రతి చిన్న చర్చను కూడా ఒక యుద్ధంలా భావించి, దీనిలో తామే గెలిచామని నిరూపించుకోవడానికి చివరి మాటను ఒక ఆయుధంలా వాడుకుంటారు. చివరి మాట తమదైతేనే తమకు ఒక రకమైన మానసిక తృప్తి లేదా ఈగో (Ego) తృప్తి చెందుతుంది.

ఇక సైకాలజీలో నార్సిసిస్టిక్ పర్సనాలిటీ (Narcissistic Personality) అని పిలిచే యారోగెంట్ మెంటాలిటీ ఉన్న వారిలో కూడా ఈ అలవాటు క్లియర్‌గా కనిపిస్తుంది. తాము చెప్పిందే వేదం అని, తామెప్పుడూ తప్పు చేయమని వీళ్లు స్ట్రాంగ్‌గా నమ్ముతారు.

ఇలాంటి వాళ్లు ఎదుటివారి అభిప్రాయాలకు, వారి భావాలకు అస్సలు విలువవ్వరు. అవతలి వ్యక్తి ఎంత లాజికల్‌గా మాట్లాడినా సరే, తమ ఈగోను పక్కన పెట్టి దాన్ని ఒప్పుకోవడానికి వీరు ఇష్టపడరు. సంభాషణను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, తామే గొప్ప అని చాటుకోవడానికి ట్రై చేస్తుంటారు.

Last Word

బంధాలలో ఇలాంటి ప్రవర్తన వల్ల అవతలి పార్ట్‌నర్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే ఈ మైండ్ సెట్ ఉన్నవారి ఫ్రెండ్స్, చుట్టాలు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే తమను ఎదుటివ్యక్తి గౌరవించాలని, తమ మాటను వినాలని అనుకుంటారు. కానీ ఎప్పుడు మాట్లాడినా తామే గెలవాలనుకునే వారితో వీలయినంత దూరంగానే ఉంటారు.

నిజమైన నాలెడ్జ్ లేదా గొప్పతనం అనేది ఆర్గ్యుమెంట్‌లో తన మాటే నెగ్గించుకోవడంలో ఉండదు. ఎదుటి వారి మాటను కూడా ఓపికగా వినడంలో , వారి భావాలను గౌరవించడంలోనూ కూడా ఉంటుందని గ్రహించినప్పుడే ఈ మానసిక బలహీనత నుంచి బయటపడతారు.

Numerology : మీ డేట్ ఆఫ్ బర్త్ 7, 16, 25 ?.. అయితే మీ మైండ్‌లో ఏముందో ఎవరూ ఊహించలేరు..

Exit mobile version