Birth And Death Certificates : బర్త్, డెత్ సర్టిఫికెట్ల రూల్స్ మార్చిన మోదీ ప్రభుత్వం.. అక్టోబర్ 1 నుంచి అమలు..

Birth And Death Certificates : బర్త్ లేదా డెత్ జరిగి ఏడాది దాటి, రెండేళ్ల లోపు ఆలస్యమైతే ఇకపై మామూలు ఆఫీసర్లు డైరెక్టుగా ఆయా సర్టిఫికెట్‌లు ఇచ్చేయలేరు.

Birth And Death Certificates

చాలామంది ఏ పనినైనా చివరి నిమిషం వరకు వాయిదా వేసేస్తుంటారు. ఇంట్లో చిన్నారి పుట్టినపుడు, లేదా పెద్దవారు చనిపోయినపుడు వెంటనే చేయించాల్సిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్(Birth And Death Certificates) సంగతి ఆ తర్వాత చూసుకోవచ్చని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఇకపై అలా బద్ధకిస్తే కుదరదు. అయినా కూడా అలాగే చేశారనుకోండి.. కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుంది.

ఎందుకంటే జనన, మరణాల నమోదు చట్టం, 2026 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రపతి కూడా దీనికి ఆమోదముద్రను వేయడంతో, అక్టోబర్ 1, 2026 నుంచే ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతున్నాయి.

ముందుగా ఏడాది దాటిన కేసుల విషయాన్ని ఒకసారి చూస్తే.. బర్త్ లేదా డెత్ జరిగి ఏడాది దాటి, రెండేళ్ల లోపు ఆలస్యమైతే ఇకపై మామూలు ఆఫీసర్లు డైరెక్టుగా ఆయా సర్టిఫికెట్‌లు ఇచ్చేయలేరు. క్షేత్రస్థాయిలో ఈ విచారణ చాలా కఠినంగా మారుతుంది. మీ అప్లికేషన్‌ను డైరెక్టుగా మేజిస్ట్రేట్ స్థాయిలోనే డీటెయిల్డ్‌గా పరిశీలిస్తారు. మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ నిజమైనవేనా అని పక్కాగా గ్రౌండ్ లెవెల్ చెకింగ్ చేస్తారు. అంతా ఓకే అయితే..దానికి తగ్గ ఫీజు కట్టించుకుని రిజిస్ట్రేషన్‌కు పర్మిషన్ ఇస్తారు.

ఒకవేళ విషయం జరిగి రెండేళ్లు దాటిపోయిందంటే ..నమోదు ప్రాసెస్ మరింత కాంప్లికేట్‌గా మారుతుంది. ఆర్డీవో లేదా లోకల్ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే పని కాదు. డైరెక్టుగా ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చే కోర్టు ఆదేశాలు ఉంటేనే గానీ ఈ సర్టిఫికెట్(Birth And Death Certificates) జారీ చేయరు. దీనిలో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అక్టోబర్ 1వ తేదీకి ఆల్రెడీ పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు కూడా సేమ్ ఇదే రూల్ వర్తిస్తుంది.

అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కఠినమైన రూల్స్ ఎందుకు తెచ్చినట్లని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను ఆసరాగా చేసుకుని, కొంతమంది నకిలీ డాక్యుమెంట్లతో దొంగ సర్టిఫికెట్లను క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లకు ఫుల్‌స్టాప్ పెట్టడంతో పాటు మన డొమెస్టిక్ డేటాలో హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్ఫరెన్సీ, అక్యురసీ తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వపు మెయిన్ ఉద్దేశం. ప్రతీ రికార్డు చాలా పక్కాగా ఉండాలనే ఆలోచనతో ఈ మల్టీ లెవల్ చెకింగ్ సిస్టమ్ తెచ్చారు.

దీనివల్ల దేశంలో దొంగ సర్టిఫికెట్లు అలాగే నకిలీ ఐడెంటిటీలకు పూర్తిగా చెక్ పడినట్లు అవుతుంది. ప్రతీ ఒక్కరి వివరాలు అఫీషియల్‌గా, నిజాయితీగా రికార్డ్ అవుతాయి. ఫ్యూచర్‌లో ఆస్తి తగాదాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, పాస్‌పోర్ట్, ఆధార్ వంటి ముఖ్యమైన పనుల్లో అసలైన లబ్ధిదారులకు ఎలాంటి మోసాలు జరగవు. వ్యవస్థలో పారదర్శకత చాలా పెరుగుతుంది.

Birth And Death Certificates

అయితే పల్లెల్లో ఉండే ప్రజలకు, నిరక్షరాస్యులకు లేదంటే ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో సర్టిఫికెట్ తీసుకోవడం మర్చిపోయిన వారికి ఇదో పెద్ద తలనొప్పిగా మారుతుంది. చిన్న ఆలస్యానికి కూడా కోర్టులు, మేజిస్ట్రేట్ల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల టైమ్‌, డబ్బులు, శ్రమ వృథా అవుతాయి. లీగల్ ప్రాసెస్ వల్ల ఆలస్యం పెరిగేకొద్దీ సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

ఏది ఏమైనా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ స్ట్రిక్ట్ రూల్స్ అమలవుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏదైనా జనన, మరణ నమోదు పెండింగ్‌లో ఉంటే.. ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రెండు, మూడు రోజుల్లోనే పని పూర్తి చేసుకోండి. లేకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్‌షిప్ సక్సెస్ అవడం కష్టమా?

↑
Exit mobile version