CNG Price Hike : నేటి నుంచే పెరిగిన సీఎన్‌జీ రేట్లు..సామాన్యులపై ఎలాంటి భారం పడనుంది?

CNG Price Hike : రాబోయే వింటర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూరోపియన్ కంట్రీలన్నీ కూడా ముందుగానే నేచురల్ గ్యాస్ నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి.

CNG Price Hike

ఇప్పటికే రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, పెరిగిన దినసరి ఖర్చులతో అల్లాడిపోతున్న సామాన్యుడిపై మరో భారీ ఇంధన భారం పడింది. దీని నుంచి అయినా రిలీఫ్ లభిస్తుందనుకుంటే, వాహనదారుల జేబులు ఖాళీ చేసేలా సీఎన్‌జీ ధరలు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి. ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) గ్యాస్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఏకంగా కిలో సీఎన్‌జీపై రూ. 3.89 పెంచుతూ షాకింగ్ ప్రకటనను రిలీజ్ చేయగా, ఈ సవరించిన కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చి వాహనదారులకు షాకిచ్చాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, అలాగే దాని చుట్టుపక్కల ఉండే ఎన్సీఆర్ ప్రాంతాల్లో సీఎన్‌జీ ధర ఇప్పుడు కిలోకు రూ. 86.98కి చేరి రికార్డు సృష్టించింది.

నిజానికి ఈ రేట్ల పెంపు వెనుక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద నెట్‌వర్క్ క్రైసిస్ దాగుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి గుండా జరిగే ఇంధన రవాణా మార్గాల్లో ఆటంకాలు కలగడంతో.. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరాపై దారుణంగా దెబ్బపడింది.

గ్యాస్ దొరకడమే కష్టంగా మారడంతో, గతంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్‌జీ ధరలు ఏకంగా రెట్టింపు అయ్యాయి. దీనికితోడు రాబోయే వింటర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూరోపియన్ కంట్రీలన్నీ కూడా ముందుగానే నేచురల్ గ్యాస్ నిల్వలను భారీగా పెంచుకుంటుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో.. ఇన్‌పుట్ కాస్ట్ భారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచడం తప్ప తమకు వేరే మార్గం లేదని ఐజీఎల్ క్లారిటీ ఇచ్చింది.

CNG Price Hike

ఈ రేట్ల బాదుడు ప్రభావం ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం సీఎన్‌జీ వాహనాలను నమ్ముకున్న ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ క్యాబ్ రన్ చేసేవారు, సీఎన్‌జీ కార్లు ఉన్నవారు, బస్సు ఆపరేటర్లపై ఎక్కువగా పడనుంది. రోజువారీ మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడంతో క్యాబ్, ఆటో ఛార్జీలతో పాటు నిత్యావసరాల ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు కూడా పెరిగి, పరోక్షంగా ప్రయాణికులపైనే కాకుండా, సామాన్యులపైన కూడా ఈ అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ధరలు పెరిగినా కూడా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎన్‌జీ సరఫరాలో మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎప్పుడూ గ్యాస్ అందేలా పక్కా ఏర్పాట్లు చేశామని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ హామీ ఇవ్వడం ఒక్కటే దీనిలో చిన్న ఊరటగా చెప్పుకోవచ్చు.

Digital Addiction : ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌తో హెల్త్ రిస్క్.. ఈ అడిక్షన్ వెనుక ఉన్న సైకలాజికల్ ఫ్యాక్ట్స్

Exit mobile version