Congress Protest
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మరో మలుపు తీసుకుంది. నిన్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇదే క్రమంలో సీజేపీ కార్యకర్తలకు, విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాయి.
అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీలు తమ గళం వినిపిస్తాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు(Congress Protest) రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్రమోదీ నివాసం దగ్గర మెరుపు ధర్నాకు దిగారు.
విద్యార్థులపై జరిగిన పోలీసులు లాఠీఛార్జ్‌కు నిరసనగా ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర వీరు ధర్నాకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని ఇంటి ముందు బైఠాయించి ధర్నాలో పాల్గొన్నారు.
నీట్ పరీక్షా అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనికి ముందు రోజు పార్లమెంట్ మార్చ్ చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ మరియు టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు ఈ మెరుపు ధర్నా చేపట్టాయి.
నిరసన ఉధృతం కావడంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ప్రధాని నివాస పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. మరోవైపు ప్రధాని మోదీ నివాసం దగ్గర పరిస్థితి చేయిదాటితే ఇబ్బందికరమేనని భావించిన కేంద్రం రాహుల్‌తో చర్చించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను పంపించింది. ఆయన ప్రధాని నివాసం బయట రాహుల్‌ను కలిసి నిరసన విరమించుకోవాలని కోరారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ ఐదు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందుంచారు(Congress Protest). ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, లోక్ సభలో అమిత్ షా ప్రకటన చేయడం, నీట్ తో పాటు పలు పోటీ పరీక్షల నిర్వహణ వైఫల్యాలపై సభలో చర్చించడం, విద్యార్థుల సమస్యల్ని కేంద్రం వినడం, నిన్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పరిస్థితిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాహుల్ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని జితేంద్ర సింగ్ చెప్పారు.
Pickaxe Mountain : అణ్వాయుధాలపై వెనక్కి తగ్గని ఇరాన్..పికాక్స్ పర్వతం దగ్గర ఏం జరుగుతోంది ?
