Dharmendra Pradhan
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేసే వరకూ కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ఆగేలా లేదు. నిన్నటి వరకు వాంగ్‌చుక్ దీక్షతో వేడెక్కిన నిరసన గళం ఇప్పుడు పార్లమెంట్ మార్చ్‌తో మరో స్థాయికి చేరింది. వేలాది మంది విదార్థులు నిరసనకు తరలిరావడం, భద్రతా బలగాలు లాఠీచార్జి చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
అయితే మొదటి నుంచీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేసే అవకాశం లేదని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామాను గట్టిగా డిమాండ్ చేస్తున్నా కూడా.. ప్రభుత్వం ఆ డిమాండ్‌ను తిరస్కరించింది. అయితే పార్లమెంట్ మార్చ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. దేశ రాజధానిలో నిరసనలు ఉధృతమవడంతో ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
లాఠీచార్జ్, విపక్షాల విమర్శలతో ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా అపాయింట్మెంట్ ఇచ్చారు. సీజీపీ ప్రతినిధులు నడ్డాను కలిసి మంత్రి రాజీనామాతో పాటు డిమాండ్లను సమర్పించారు. దీనిపై అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని నడ్డా తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే ఇండియా కూటమి , ఇతర వామపక్ష పార్టీలు ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని లేదా ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని పట్టుబడుతున్నాయి.
తొలి రోజు సభ కనీసం అరగంట కూడా సాగలేదు. అయితే నేటి నుంచి ఉభయ సభలు దద్దరిల్లిపోవడం ఖాయం. అటు విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతుంటే ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు వ్యూహ రచన చేస్తున్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్షాలు సభను అడ్డుకుంటూ రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ, నిర్మాణాత్మక చర్చకు సిద్ధంగా ఉండాలని కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
Wife Exchange : సిటీలలో కపుల్ స్వింగింగ్ కల్చర్.. వైఫ్ ఎక్స్ఛేంజ్ మైండ్‌సెట్ ఎందుకు పెరుగుతుంది?
