Bank Jobs : 13 వేలకు పైగా బ్యాంకింగ్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే..

Bank Jobs : ఆఫీస్‌ అసిస్టెంట్ , ఆఫీసర్‌ స్కేల్‌-1 పోస్టులకు ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి.

Bank Jobs

బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగం సాధించి జీవితంలో సెటిల్ అవ్వాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చింది. నోటిఫికేషన్‌ కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థుల కల నెరవేరుస్తూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) 2026-27 సంవత్సరానికి.. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాలను ప్రకటిస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఏకంగా 13,706 పోస్టులను భర్తీ చేయడానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ శ్రీకారం చుట్టింది. అప్లికేషన్‌ల ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా మొదలైపోవడంతో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న లక్షలాది మంది కేండిడేట్లకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.

ఈ నియామకంలో ముఖ్యంగా ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్ – క్లర్క్) కేటగిరీలోనే ఎక్కువగా 8,183 ఖాళీలు ఉండటం విశేషం. ఇక ఆఫీసర్‌ స్కేల్‌-1 (పీఓ) కేటగిరీలో 4,256 పోస్టులు, స్కేల్‌-2 (మేనేజర్‌) కేటగిరీలో 1,047 పోస్టులు, స్కేల్‌-3 (సీనియర్‌ మేనేజర్‌) విభాగంలో 220 ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి ఉన్న కేండిడేట్లు సెప్టెంబరు 21వ తారీఖు లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్‌లో ఏవైనా తప్పులుంటే దిద్దుకోవడానికి లాస్ట్ డేట్ ముగిసిన తర్వాత కూడా మరో రెండు రోజులు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఇక ఎగ్జామ్స్ విషయానికి వస్తే ప్రిలిమినరీ కంటే ముందు ఇచ్చే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) నవంబరులో స్టార్ట్ అవుతుంది.

ఆఫీస్‌ అసిస్టెంట్ , ఆఫీసర్‌ స్కేల్‌-1 పోస్టులకు ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. స్కేల్-1 మెయిన్స్ దాటిన వారికి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. మెయిన్స్లో సాధించిన మార్కులు, సంబంధిత రాష్ట్రాలు లేదా యూటీలలో ఉన్న ఖాళీల ఆధారంగానే కేండిడేట్స్‌కు ఫైనల్ పోస్టింగ్ ఇస్తారు.

Bank Jobs

అలాగే ఆఫీసర్‌ స్కేల్‌-2, స్కేల్‌-3 పోస్టులకు మాత్రం రెండు ఎగ్జామ్స్ లేకుండా ఒకే ఒక ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహించి, దానిలో క్వాలిఫై అయిన వారిని డైరెక్టుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎగ్జామ్ పాటర్న్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ వంటి పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్ ibps.in లో నోటిఫికేషన్ చెక్ చేసి వెంటనే అప్లై చేసుకోవాలి.

సరైన ప్లానింగ్‌తో ఇప్పటి నుంచీ ప్రిపరేషన్ ప్రారంభిస్తే.. ఈసారి బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం మీ సొంతం కావడం ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో అప్లై చేసి ప్రిపేర్ అయిపోండి.

Madhuri Rathod : తనను మోసం చేశాడంటూ మాధురి కేసు..ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పరారీ..

Exit mobile version