IRCTC : రైలు టికెట్ బుకింగ్ ఇక సూపర్‌ఫాస్ట్..క్యాప్చాలు, పాపప్‌ల గోల ఉండదు..

IRCTC : టికెట్ బుకింగ్ ప్రాసెస్‌ను మరింత స్పీడ్‌గా, ఈజీగా మార్చే ఉద్దేశంతో కొత్త ఫీచర్లతో కూడిన వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను లాంచ్ చేసింది.

IRCTC

ట్రైన్ జర్నీల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్‌లో ఎదురయ్యే సర్వర్ స్లో ఇబ్బందులు అలాగే , క్యాప్చాలు, పాపప్‌లు వంటి ఇతర ఇబ్బందులకు చెక్ పెట్టడానికి ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది.

తాజాగా ..టికెట్ బుకింగ్ ప్రాసెస్‌ను మరింత స్పీడ్‌గా, ఈజీగా మార్చే ఉద్దేశంతో కొత్త ఫీచర్లతో కూడిన వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ట్రయల్ రన్‌లో ఉన్న ఈ పోర్టల్‌పై వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఆ తర్వాత దీనిని పూర్తిస్థాయిలో లైవ్‌లోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మోడ్రన్ వెబ్‌సైట్‌లో కస్టమర్ల సౌకర్యం కోసం విప్లవాత్మక మార్పులు చేశారు. ప్రతిసారీ విసుగు తెప్పించే క్యాప్చా ఎంట్రీల నెంబర్లను చాలా వరకు తగ్గించేశారు. అలాగే స్క్రీన్‌పై అడ్డొచ్చే అన్‌వాంటెడ్ పాపప్‌లు, యాడ్స్ వంటివి ఏమీ లేకుండా క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేశారు.

ఇప్పటివరకు వేర్వేరు కోచ్‌లలో సీట్ల అవైలబులిటీని తెలుసుకోవాలంటే విడివిడిగా క్లిక్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒకేసారి .. ఒకే ఒక్క స్క్రీన్‌పై స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వంటి అన్ని క్లాసుల సీట్ల స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులు స్పీడ్‌గా ఒక డెసిషన్‌కు వచ్చే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, టికెట్ కన్ఫర్మ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ కౌంట్‌ను కూడా తగ్గించి బుకింగ్‌ను సింపుల్ చేశారు. రెగ్యులర్‌గా జర్నీ చేసే వారి కోసం ప్యాసింజర్ల వివరాలను ముందే స్టోర్ చేసుకునే మెమొరీ ఫెసిలిటీని కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసినప్పుడు లేదా ఎక్కువ టికెట్లు ఒకేసారి బుక్ చేసేటప్పుడు పదేపదే వారి పేర్లు, వయసు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు.

అయితే ఈ కొత్త డిజైన్ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఎంఎన్ఐటీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన స్టూడెంట్స్‌ను కలిసి ఒక మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ టైమ్‌లో వెబ్‌సైట్ మేనేజ్‌మెంట్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడంపై వారు ఇచ్చిన క్రేజీ ఐడియాస్ ఆధారంగానే ఈ సరికొత్త పోర్టల్‌ను డెవలప్ చేసినట్లు పీఐబీ వెల్లడించింది.

IRCTC

2002లో స్టార్ట్ అయిన ఐఆర్‌సీటీసీ(IRCTC) ద్వారా ప్రెజెంట్‌ డైలీ యావరేజ్‌గా 14.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇంత భారీ ట్రాఫిక్‌ను తట్టుకుని కస్టమర్లకు బెస్ట్ సర్వీస్ ఇవ్వడమే ఈ అప్‌డేట్ మెయిన్ టార్గెట్ అని రైల్వే శాఖ భావిస్తోంది.

ఈ నయా బీటా వెర్షన్‌ను ట్రై చేయాలనుకునే వారు డైరెక్టుగా అఫీషియల్ లింక్ ద్వారా గానీ, లేదా ఇప్పుడు హోమ్‌పేజీలో కనిపిస్తున్న బీటా వెర్షన్ ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా గానీ యాక్సెస్ చేయొచ్చు. ఈ ట్రయల్ పీరియడ్‌లో యూజర్ల నుంచి వచ్చే సజెషన్స్ బట్టి మరికొన్ని మోడిఫికేషన్స్ చేస్తారు. కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌తో దీనిని కనెక్ట్ చేశాక..ఆ తర్వాత రాబోయే కొద్ది వారాల్లోనే ఈ అప్‌గ్రేడెడ్ పోర్టల్ పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Fauzi : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. మాస్ పోస్టర్‌తో ఫౌజీ ..రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Exit mobile version