LPG Subsidy : ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్..అక్టోబర్ 1 నుంచి వారికి సబ్సిడీ కట్

LPG Subsidy : సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చే సిబ్బంది దగ్గర ఉండే బయోమెట్రిక్ మిషన్ ద్వారా లేదా డైరెక్టుగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీకి వెళ్లి ఈ పనిని పూర్తి చేయొచ్చు.

LPG Subsidy

వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ చాలా ముఖ్యమైన ప్రకటన రిలీజ్ చేసింది. సబ్సిడీతో కూడిన ఇంటి వినియోగం ఎల్పీజీ సిలిండర్లను పొందుతున్న వారంతా అక్టోబర్ 1వ తేదీ, 2026 నాటికి తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

నకిలీ కనెక్షన్లను ఏరిపారేయడంతో పాటు అర్హులైన పేదవారికి మాత్రమే సబ్సిడీ డబ్బులు డైరెక్టుగా అందేలా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

మంత్రిత్వ శాఖ అందించిన డీటెయిల్స్ ప్రకారం.. సెప్టెంబర్ 19 వ తేదీ నాటికే దేశంలోని మొత్తం 27.43 కోట్ల వినియోగదారుల్లో సుమారు 89.9 శాతం మంది ఈ బయోమెట్రిక్ ప్రాసెస్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పాటు గతంలో వెరిఫికేషన్ పూర్తయిన వారు మళ్లీ ఈ ప్రాసెస్ కోసం ఇబ్బంది పడక్కర లేదు.

కానీ ఇప్పటివరకు వెరిఫికేషన్ చేసుకోని వారు మాత్రం అక్టోబర్ 1వ తేదీ తర్వాత సబ్సిడీ ధరకు రీఫిల్ బుక్ చేసుకోవాలంటే మాత్రం ఈ అథంటికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. ఒకవేళ బయోమెట్రిక్ చేయకపోతే మాత్రం గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది కానీ వారికి సబ్సిడీ(LPG Subsidy) రాదు, మార్కెట్‌లో గ్యాస్ ధర ఎంత ఉందో అంత చెల్లించాల్సి ఉంటుంది.

ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా ఈజీ అండ్ దీనికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చే సిబ్బంది దగ్గర ఉండే బయోమెట్రిక్ మిషన్ ద్వారా లేదా డైరెక్టుగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీకి వెళ్లి ఈ పనిని పూర్తి చేయొచ్చు.

LPG Subsidy

అంతేకాకుండా మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఈ వెరిఫికేషన్‌ను ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు. ఇండేన్ యూజర్లు ఇండేన్ ఆయిల్ వన్( IndianOil ONE), భారత్ గ్యాస్ వినియోగదారులు హలోబీపీసీఎల్ (HelloBPCL), హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు హెచ్‌పీ పే( HP PAY) యాప్‌లను ఉపయోగించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.

ఏవైనా డౌట్స్ ఉంటే 1800 2333 555 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించొచ్చు. సబ్సిడీ(LPG Subsidy) డబ్బులు మిస్ కాకూడదంటే ముందే చెక్ చేసుకుని ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయడం మంచిది.

Elon Musk Neuralink : పెదవి విప్పకుండానే ఐ లవ్ యూ..ఆలోచనలకు వాయిస్ ఇచ్చిన ఎలాన్ మస్క్ టెక్నాలజీ..

Exit mobile version