Mamata Banerjee : దీదీకి నిద్రలేని రాత్రులు..కౌంటింగ్ పై శ్రేణులకు కీలక ఆదేశాలు

Mamata Banerjee : బెంగాల్ లో ఈ సారి సంచలన ఫలితాలు నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుత సీఎం మమతా బెనర్జీకి నిద్ర కరువైంది.

Mamata Banerjee

బెంగాల్ లో ఈ సారి సంచలన ఫలితాలు నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుత సీఎం మమతా బెనర్జీకి(Mamata Banerjee) నిద్ర కరువైంది. ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర టీఏంసీ అధినేత్రి తమ పార్టీ నేతలతో హడావుడి చేశారు. దీంతో కౌంటింగ్ కు ముందు బెంగాల్ లో వాతావరణం వేడెక్కింది.

అటు కౌంటింగ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో మమతా బెనర్జీ(Mamata Banerjee) తమ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. తమ ఏజెంట్లకు, పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. తాము 200కు పైగా సీట్లను గెలుస్తామని దీదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంతా ఎన్డీఏ ప్రభుత్వం చేసే గిమ్మిక్కుగా అభివర్ణించారు.

స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేసేందుకే తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పించుకున్నారని ఆరోపించారు. నూటికి నూరు శాతం బెంగాల్ లో మరోసారి తామే అధికారంలోకి రాబోతున్నట్టు పార్టీ శ్రేణులతో మమత స్పష్టం చేశారు.

291 నియోజక వర్గాల కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ పద్ధతిలో సుదీర్ఘంగా భేటీ అయిన ఆమె.. టీఎంసీ ఘనవిజయం సాధించబోతోందని చెప్పారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు లెక్కింపు కేంద్రాల నుంచి ఎవ్వరూ కదలడానికి వీల్లేదని ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు సమయంలో ఏజెంట్లు అనుసరించాల్సిన వ్యూహంపై మమత కీలక సూచనలు చేశారు. ఫలితం ఎలా ఉన్నా ప్రక్రియ మొత్తం ముగిసాకే బయటకు వెళ్ళాలని కఠిన ఆదేశాలిచ్చారు. తమ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్నట్టు అనుమానం వస్తే రీకౌంటింగ్ కు డిమాండ్ చేయాలని ఆదేశించారు.

Mamata Banerjee

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఆందోళనకు కారణముంది. ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ విధానం ద్వారా దాదాపు 90 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. దీంతో తమ పార్టీ మద్ధతుదారులనే తొలగించారని టీఎంసీ గట్టిగా ఆరోపిస్తోంది.

అలాగే స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతపై మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందని చెప్పడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. కీలక నియోజక వర్గాల్లో బీజేపీ, టీఏంసీ మధ్య హోరాహోరీ తప్పదని అంచనా వేస్తున్నారు. ఎవరు గెలిచినా కూడా గెలుపు మార్జిన్ స్వల్ప స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.

Dark Comedy : మలయాళం సంచలన డార్క్ కామెడీ..ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?

Exit mobile version