October 1 New Rules : అక్టోబర్ 1వ తేదీ నుంచి మారనున్న కొత్త నిబంధనలు..

October 1 New Rules : లాస్ట్ మినిట్‌లో హడావుడి పడకుండా, సబ్సిడీలు కోల్పోకుండా ఉండాలంటే అక్టోబర్ 1 నుంచి రానున్న కొత్త మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.

October 1 New Rules

క్యాలెండర్‌లో నెల మారిన ప్రతిసారీ కూడా మన డైలీ లైఫ్‌లోనూ, జేబులోనూ చాలా మార్పులు వచ్చి పడుతుంటాయి. అలాగే, ఈ అక్టోబర్ 1వ తేదీ(October 1 New Rules) నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుల జీవితాలను డైరెక్టుగా ఎఫెక్ట్ చేసే కొన్ని కీలకమైన రూల్స్ అమల్లోకి వస్తున్నాయి.

కిచెన్‌లో ఉండే గ్యాస్ సిలిండర్ నుంచి బ్యాంక్‌లో దాచుకునే సేవింగ్స్ మనీ వరకు, అలాగే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ వరకూ కేంద్ర ప్రభుత్వం, ఆయా కంపెనీలు స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేస్తున్నాయి. లాస్ట్ మినిట్‌లో హడావుడి పడకుండా, సబ్సిడీలు కోల్పోకుండా ఉండాలంటే ఈ కొత్త మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.

అక్టోబర్ 1వ తేదీ(October 1 New Rules) నుంచి మీరు తక్కువ కాస్ట్‌కు సిలిండర్ పొందడానికి బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవడం తప్పనిసరి. ఇండియాలో ఇప్పటికే 27.43 కోట్లకు పైగా యాక్టివ్ గృహ వినియోగదారులలో సుమారు 89.9 శాతం మంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేశారు. ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ పని చేయకపోతే భయపడాల్సిన పనిలేదు. మీకు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే టైమ్‌లో డెలివరీ బాయ్ ద్వారా గానీ, లేదా డైరెక్టుగా మీ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీకి వెళ్లి గానీ ఈ ప్రక్రియ చేసుకోవచ్చు.

అంతేకాదు ఇండేన్ వాడే వాళ్లు IndianOil ONE యాప్, భారత్ గ్యాస్ వాడే వాళ్లు HelloBPCL యాప్, హెచ్‌పీ కస్టమర్లు HP PAY యాప్స్ ద్వారా మొబైల్‌లోనే ఈ ఆధార్ వెరిఫికేషన్‌ను ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆథెంటికేషన్ చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ రద్దయిపోదు కానీ.. మీకు రావాల్సిన సబ్సిడీ అమౌంట్ ఒకటే నిలిచిపోతుంది.

బ్యాంక్ డిపాజిట్ల ఇంట్రస్ట్ రేట్లకు సంబంధించింది రెండో మార్పు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారి కోసం ఆర్బీఐ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఒకే రోజు ఒకే బల్క్‌లో డిపాజిట్ చేసే సేవింగ్స్ , ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఆయా బ్రాంచ్‌లకు లేదంటే కస్టమర్‌ను బట్టి ఇష్టారాజ్యంగా వేర్వేరు ఇంట్రస్ట్ రేట్లు ఇవ్వడానికి ఇకపై బ్యాంకులకు వీలుండదు. నిబంధనల ప్రకారం డిపాజిట్ వడ్డీ వివరాలను బ్యాంకులు ముందే కంపల్సరీగా వెల్లడించాల్సి ఉంటుంది. దీనివల్ల కస్టమర్లకు తమ డబ్బుపై ఎంత వడ్డీ వస్తుందో ముందుగానే క్లారిటీ వస్తుంది.

October 1 New Rules

బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ (Birth and Death Certificates)పై కూడా కఠిన నిబంధనలు రాబోతున్నాయి. ఇకపై బర్త్ అండ్ డెత్ సమయాలను టైమ్‌కు రిజిస్టర్ చేయకపోతే ఆ ప్రాసెస్ కష్టంగా మారనుంది. ఏదైనా జననం లేదా మరణం జరిగి ఏడాది దాటిన తర్వాత నుంచి రెండేళ్ల లోపు ఎంటర్ చేయాలంటే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి స్పెషల్ ఆర్డర్లు, సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండేళ్లు కూడా దాటిపోతే మాత్రం డైరెక్టుగా జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (Judicial Magistrate First Class) కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటేనే రికార్డుల్లో ఎంట్రీ చేస్తారు. తప్పుడు ఆధారాలతో లేదా నకిలీ పత్రాలతో సర్టిఫికేట్లు సృష్టించే ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకువచ్చారు.

Apple Pay : డిజిటల్ మార్కెట్లోకి యాపిల్ పే ఎంట్రీ.. ఫోన్‌పే, గూగుల్ పే యాప్‌లకు చెక్ తప్పదా?

↑
Exit mobile version