Pawan Kalyan : ఊళ్లో పెళ్లికి ఎవరో హడావుడి..విజయ్ తో పోల్చడంపై వైసీపీకి పవన్ కౌంటర్

Pawan Kalyan : తమిళనాడు సీఎం విజయ్‌తో పోల్చి తనను వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

Pawan Kalyan

తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే చీఫ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే విజయ్ గెలుపును ఆ పార్టీ కంటే ఎక్కువగా ఏపీలోని వైసీపీ శ్రేణులు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నాయి. పనిలో పనిగా విజయ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. పవన్ ను విపరీతంగా ట్రోల్ చేసాయి. దీనికి జనసేన శ్రేణులు కూడా కౌంటర్ ఇవ్వడంతో కొద్దిరోజులు ఇదే హాట్ టాపిక్ గా నడిచింది.

తాజాగా ఈ ట్రోలింగ్ పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. మంగళగిరిలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. విజయ్ తో తనను ఎందుకు పోలుస్తున్నారంటూ ప్రశ్నించారు. తమిళనాడులో పరిస్థితులు వేరనీ, ఏపీలో పరిస్థితులు వేరనీ పవన్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి అయిపోవాలన్న లక్ష్యంతో తాను పార్టీ పెట్టలేదని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే పార్టీ స్థాపించాననీ పవన్ స్పష్టం చేశారు. పనిలో పనిగా వైసీపీ శ్రేణుల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో యాక్టర్ పార్టీ పెట్టి సీఎం అయితే ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారనీ, ఊరిలో పెళ్లికి ఎవరో హడావిడి అన్నట్టు వాళ్ల తీరు ఉందని సెటైర్లు వేశారు. 11 సీట్లకు పరిమితమైన పార్టీ కూడా మనకు నీతులు చెబుతుందంటూ విమర్శించారు.

తమిళనాడు ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ మీరు కూడా సింగిల్ గా పోటీ చేసి ఉండాల్సిందంటూ కొందరు సలహాలు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. 2019 లో సింగిల్ గా పోటీ చేసినప్పుడు రెండు చోట్లా ఓడించారు కదా అని గుర్తు చేశారు. ఆ ఓటమి తర్వాత చాలా మంది పార్టీని వీడి వెళ్లిపోయారంటూ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan

తాను ఎన్నో ఎదురుదెబ్బలు తిని పార్టీని నడుపుతున్నాననీ, బయట కూర్చుని మాట్లాడడం చాలా సులువన్నారు. వైసీపీ శ్రేణుల విమర్శలను తాను చాలాసార్లు పట్టించుకోననీ, ఒక్కోసారి మాత్రం చిరాకు అనిపిస్తే స్పందిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. సభ్యత్వాల నమోదు 21 లక్షలు దాటడంపైనా పవన్ ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణలో మొదలై, ఏపీలోనూ, తర్వాత యూపీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు కావడం గర్వంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే తన అనారోగ్య సమస్యలపైనా పవన్(Pawan Kalyan) మాట్లాడారు. సైనస్ సమస్యతో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనీ, భుజాల మధ్య టేర్ వచ్చిందన్నారు. తన కోసం ప్రార్థించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Rupee:డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. చరిత్రలో తొలిసారిగా 96 మార్కును దాటిన మారకపు విలువ

Exit mobile version