Salaries For Employees : ఉద్యోగులు,పెన్షనర్లకు ఊరట..సెప్టెంబర్ 25న ఉద్యోగులకు జీతాలు..

Salaries For Employees : కాలంచెల్లిన వేతన సవరణ ప్లేస్‌లో, ఎనిమిదవ వేతన కమిషన్ (8th Pay Commission) ఏర్పాటుకు అఫీషియల్‌గా ఆమోదముద్రను వేసింది.

Salaries For Employees

నెలాఖరున ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో అందరికీ తెలిసిందే. సరిగ్గా సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనుండటంతో.. ముందస్తుగా ఎదురయ్యే ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

సాధారణంగా నెలలో చివరి తేదీలో లేదా వచ్చే నెల ప్రారంభంలో జమ అయ్యే శాలరీలు, పెన్షన్ల కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. అయితే సమ్మె వల్ల డబ్బులు విత్‌డ్రాయల్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్లలో ఇబ్బందులు తలెత్తి ప్రజలు ఇబ్బందులు పాలవ్వకూడదనే ఉద్దేశంతో, సెప్టెంబర్ నెలకు సంబంధించిన శాలరీలు , పెన్షన్ డబ్బులను సెప్టెంబర్ 25వ తేదీనే ముందస్తుగా సంబంధిత అకౌంట్లలో(Salaries For Employees) వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఈ ముందస్తు ఊరట నిర్ణయం కేవలం సాధారణ సివిల్ సిబ్బందికే పరిమితం కాకుండా.. అత్యంత కీలకమైన డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్లకు కూడా వర్తింపజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఈ మొత్తాన్ని నిబంధనల ప్రకారం దీనిని అడ్వాన్స్ పేమెంట్‌గా లెక్కిస్తారు.

తర్వాత అన్ని రకాల క్లియరెన్సులు, ఫైనల్ లెక్కలు పూర్తయ్యాక, రాబోయే అక్టోబర్ చెల్లింపుల్లో మిగిలిన మొత్తాన్ని అడ్జస్ట్ చేయనున్నారు.అటు బ్యాంకుల సమ్మె భయం, ఇటు నెలవారీ ఖర్చుల భారం ఒకేసారి వెంటాడుతున్న సమయంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటును కల్పించిందనే చెప్పొచ్చు.

అంతేకాకుండా ఎంప్లాయిస్ లాంగ్‌రన్ ఫ్యూచర్‌కు భవిష్యత్తుకు సంబంధించిన మరొక నిర్ణయానికి మోదీ కేబినెట్ శ్రీకారం చుట్టింది. కాలంచెల్లిన వేతన సవరణ ప్లేస్‌లో, ఎనిమిదవ వేతన కమిషన్ (8th Pay Commission) ఏర్పాటుకు అఫీషియల్‌గా ఆమోదముద్రను వేసింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 50 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు డైరెక్టుగా లబ్ధి పొందనున్నారు.

Salaries For Employees

జస్టిస్ రంజనా ప్రకాష్ దేసాయి అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ కమిషన్‌లో.. ప్రొఫెసర్ పులక్ ఘోష్, పంకజ్ జైన్ సభ్యులుగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. రాబోయే 18 నెలలలో ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, మారుతున్న ఫైనాన్సియల్ కండీషన్స్‌కు అనుగుణంగా మెరుగైన జీవన ప్రమాణాలను అందించేలా తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తుంది.

Sugar : పంచదారకు బై చెప్పేశారా? సైంటిస్టులు చెబుతున్న ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..

Exit mobile version