Vijay : మ్యాజిక్ ఫిగర్ వచ్చాక రండి..విజయ్ కు గవర్నర్ షాక్

Vijay : తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగా గవర్నర్ షాకిచ్చారు

Vijay

తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్(Vijay) టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగా గవర్నర్ షాకిచ్చారు. మ్యాజిక్ ఫిగర్ లేని కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేనని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది జాబితాను తీసుకుని రావాలని సూచించారు.

నిన్నటి నుంచి గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసిన విజయ్(Vijay) కు ఇవాళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ టైమిచ్చారు. తన సంఖ్యాబలం జాబితాతో గవర్నర్ ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నానని, 10 రోజుల్లో బలం నిరూపించుకుంటానని వినతి పత్రం ఇచ్చారు.

అయితే గవర్నర్ మాత్రం విజయ్ ఇచ్చిన జాబితాతో సంతృప్తి చెందలేదు. 118 మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో అదే విషయాన్ని విజయ్ కు వివరించినట్టు తెలుస్తోంది.ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్లు ఉండాల్సిందేనని, అది వచ్చాక రావాలని విజయ్ తో చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం విజయ్ 112 మందితో కూడిన జాబితాను ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ కు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలవగా, డీఏంకే 59, అన్నాడీఏంకే 47 చోట్ల గెలిచాయి. కాంగ్రెస్ 5, పీఎంకే 4, ఐయూఎంల్ 2, సీపీఐ 2 , సీపీఎం 2 చోట్ల విజయం సాధించాయి. విజయ్ కు కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఐదు సీట్లు కలిపినా, విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానంలో రాజీనామా చేయాల్సి ఉంది.

Vijay

దీంతో 112 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. మిగిలిన పార్టీలతో చర్చలు జరుపుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా 118 మార్క్ వచ్చాక మళ్లీ రావాలని సూచించినట్టు తెలుస్తోంది. విజయ్ టీవీకే పార్టీకి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఐయూఎంల్, వామపక్ష పార్టీలు తేల్చి చెప్పాయి.

దీంతో మిగిలిన ఆరుగురి బలం కూడగట్టేందుకు విజయ్ టీవీకే పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. డీఎంకే జత కట్టే పరిస్థితి లేకపోవడంతో అన్నాడీఏంకే మద్దతు తీసుకుంటారా లేక ఇతర చిన్న పార్టీల డిమాండ్లను ఓకే చేసి ప్రభుత్వ ఏర్పాటుకు వెళతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Gold Prices : బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే పెరిగిన రేట్లు

Exit mobile version