Vehicle Scrapping Policy : పాత వెహికల్స్ ఎప్పుడు స్క్రాప్ చేయాలి? కండీషన్లు ఏంటి, ఉపయోగాలేంటి?

Vehicle Scrapping Policy : ఐరన్ మెటల్, స్పేర్ పార్ట్స్‌కు తగ్గ అమౌంట్‌ను వెంటనే ఇస్తారు. దీంతో పాటు ఒక అఫీషియల్ స్క్రాపింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Vehicle Scrapping Policy

మన పాత బైక్ లేదా కారును చూసి దాన్ని రిపేర్ చేయిస్తే బెటరా లేక అలానే వదిలేయాలా అనే చాలామంది అనుకుంటారు. పాత వెహికల్స్ వాడినా కూడా అవి మైలేజ్ రాకపోవడం, విపరీతంగా కాలుష్యం పెరగడం, తరచూ మెకానిక్ షాప్ చుట్టూ తిరుగుతూ జేబు ఖాళీ అవ్వడం వంటి ఇబ్బందులుంటాయి.

ఇలాంటటి తలనొప్పులన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద వెహికల్ స్క్రాపింగ్ పాలసీ(Vehicle Scrapping Policy) బెటర్ సొల్యూషన్‌ అవుతుంది. పాత వెహికల్‌ను అమ్ముకోవడం కంటే స్క్రాపింగ్‌కు అప్పగిస్తే చేతికి డబ్బులు రావడమే కాకుండా, కొత్తగా కొనే బైక్ లేదా కారుపై మోటార్ వెహికల్ ట్యాక్స్‌లో భారీ డిస్కౌంట్లు పొందొచ్చు

పాతబడిన, పొగ చిమ్మే వెహికల్స్‌ను సైంటిఫిక్‌గా రీసైకిల్ చేయడం, అలాగే వాహనదారులకు ఫైనాన్సియల్‌గా బెనిఫిట్స్ ఇవ్వడమే..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ పాలసీ (Voluntary Vehicle Scrapping Policy) ముఖ్య ఉద్దేశం. అయితే మీ వెహికల్ ఎన్ని ఇయర్స్‌కు స్క్రాపింగ్‌కు ఇవ్వొచ్చు దాని టైప్‌పై ఆధారపడి ఉంటుంది.

క్యాబ్‌లు, బస్సులు, ఆటోల వంటి కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ 8 ఏళ్లు దాటిన తర్వాత స్క్రాప్ చేసుకోవడానికి రూల్స్ పర్మిషన్ ఇస్తాయి. అదే మన పర్సనల్ కార్లు, బైక్‌లు అయితే 15 ఇయర్స్ పూర్తయిన తర్వాత స్క్రాప్‌కు అప్పగించొచ్చు.

ప్రైవేట్ వ్యక్తులకు ఇది పూర్తిగా వాళ్లిష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆర్టీసీ బస్సులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో వాడే కార్ల వంటి గవర్నమెంట్ వెహికల్స్ 15 ఏళ్లు నిండితే కచ్చితంగా స్క్రాప్ చేయాల్సిందే తప్ప వాటిని రోడ్డెక్కించడానికి వీల్లేదు.

మీ పాత వెహికల్‌ను ప్రభుత్వం గుర్తించిన ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ’ (RVSF) సెంటర్‌కు తీసుకెళ్తే, అక్కడ వెహికల్ కండిషన్ ఆధారంగా వేలం వేసి స్క్రాప్ వ్యాల్యూ కడతారు. ఐరన్ మెటల్, స్పేర్ పార్ట్స్‌కు తగ్గ అమౌంట్‌ను వెంటనే ఇస్తారు. దీంతో పాటు ఒక అఫీషియల్ స్క్రాపింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Vehicle Scrapping Policy

ఈ సర్టిఫికెట్‌ను కొత్త వెహికిల్ కొన్నప్పుడు ఉపయోగిస్తే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మోటార్ వెహికల్ రోడ్ ట్యాక్స్‌లో (Motor Vehicle Tax) డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, మీ ఓల్డ్ వెహికల్‌పై ఏవైనా గ్రీన్ ట్యాక్స్ బకాయిలు, ఫైన్లు, వేరే చలాన్లు ఉంటే.. స్క్రాపింగ్ ప్రాసెస్ ద్వారా వాటిలో సడలింపులు లేదంటే వన్-టైమ్ సెటిల్‌మెంట్ వంటి ఛాన్సులు ఇస్తారు.

తెలంగాణలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు అలాగే సిద్ధిపేట జిల్లా వర్గల్, వీటితో పాటు సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతాల్లో గవర్నమెంట్ స్క్రాపింగ్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఈ ఆథరైజ్డ్ సెంటర్లు ఉన్నాయి.

Bad Smell From Kitchen : కిచెన్ బ్యాడ్ స్మెల్‌కి పర్ఫెక్ట్ చెక్ మేట్..వంటగదిని రిఫ్రెషింగ్‌గా మార్చే చిట్కాలు..

Exit mobile version