Vikram-1: అంతరిక్ష రేసులో భారత్ టాప్-3..నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్ రాకెట్..

Vikram-1: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్.. విక్రమ్ -1 రాకెట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసింది.

Vikram-1

భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైంది. దేశంలోనే ఫస్ట్ టైమ్ ఒక ప్రైవేట్ సంస్థ రూపొందించిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1(Vikram-1) ప్రయోగం విజయవంతమైంది.జూలై 18 వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్.. ఈ రాకెట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంతో.. శాటిలైట్‌లను దిగ్విజయంగా భూమికి దగ్గరగా ఉండే కక్ష్య (లో అర్త్ ఆర్బిట్)లో ప్రవేశపెట్టారు.

నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 11:30 గంటలకే ఈ రాకెట్ లాంచ్ అవ్వాల్సి ఉంది. అయితే కౌంట్‌డౌన్ ముగిసే మరికొద్ది నిమిషాల ముందుగా కంట్రోల్ టీమ్ ప్లాన్డ్ హోల్డ్ ప్రకటించడంతో కాస్త ఆలస్యంగా జర్నీ స్టార్ట్ అయింది.

ఆ తర్వాత టెక్నికల్ ప్రాసెస్‌లన్నీ పూర్తి చేసుకుని 12:05 గంటలకు రాకెట్ నింగి వైపు ప్రయాణించింది. సుమారు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగల సామర్థ్యమున్న ఈ రాకెట్.. నిర్దేశిత 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి శాటిలైట్‌లను పర్ఫెక్ట్‌గా చేరవేసింది.

ఈ అద్భుత విజయం తర్వాత స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని షేర్ చేసుకుంది. హిస్టరీ క్రియేట్ అయింది.. విక్రమ్-1(Vikram-1) తన ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి కక్ష్యను చేరుకుందని ప్రకటించింది.

Vikram-1

ఈ ఘనతతో ప్రైవేట్ సెక్టార్‌లో అంతరిక్ష ప్రయోగాలు చేయగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని టాప్-3 దేశాల లిస్ట్‌లో భారతదేశం కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ప్రయోగానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ.. స్కైరూట్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో సరికొత్త శకానికి ఇదొక నాంది అని ప్రశంసించారు.

 

 

Aamir Khan : మొన్న సల్మాన్ ఇప్పుడు అమీర్ ఖాన్‌..బాలీవుడ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గండం. .

Exit mobile version