Konda Surekha
కొద్ది రోజులుగా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా కొండా సురేఖ ఇష్యూ ఏదొక విధంగా వైరల్ అవుతూనే ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ 3న తనను మంత్రి పదవి నుంచి వేటు వేసిన తర్వాత కాస్త ఫీలయినట్లు కనిపించిన కొండా సురేఖ, తాజాగా సోషల్ మీడియాలో ఒక సింగిల్ పోస్ట్ పెట్టి మరోసారి స్టేట్ వైడ్‌గా పొలిటికల్ హీట్‌ను పెంచేశారు.
ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే మైండ్ బ్లాకింగ్ నిర్ణయం ప్రకటిస్తానంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇవ్వడం.. ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో క్యూరియాసిటీని రేపుతోంది. అసలు సురేఖ నెక్ట్స్ స్టెప్ ఏంటి? ఏ సంచలన నిర్ణయాన్ని బయటపెడతారు అంటూ అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
కేబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత మాట్లాడిన కొండా సురేఖ .. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనని, ఎటువంటి పదవులు లేకపోయినా ఎమ్మెల్యేగానే కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకే అంకితమవుతానని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు బిగ్ అప్‌డేట్ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ పెట్టడంతో.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని హస్తం పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా ఆలోచిస్తున్నారా అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
దీనికి తోడు కొండా మురళి రీసెంట్‌గా మీడియా ముందు ప్రదర్శించిన దూకుడు, ఓపెన్‌గా మీసాలు తిప్పుతూ చేసిన మాస్ కామెంట్స్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. కొండా కాంపౌండ్ కాంగ్రెస్‌లోనే ఉంటుందా లేక ఆ పార్టీకి షాక్ ఇస్తుందా అన్న టాక్ నడుస్తోంది.
నిజానికి కొండా సురేఖ(Konda Surekha) పొలిటికల్ కెరీర్‌లో ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత వైఎస్ జగన్‌ను సీఎం చేయాలనే పట్టుదలతో.. అప్పటి అధిష్టానాన్నే ధిక్కరించి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కూడా అలాగే పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారా అన్న చర్చ నడుస్తోంది.
మరోవైపు కొండా దంపతుల భవిష్యత్తు అడుగులపై రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. కేబినెట్ నుంచి ఆమెను తొలగించాక, ఆమె ఏ పార్టీలో చేరే అవకాశం ఉందా అని ముందే అంచనా వేయడానికి కాంగ్రెస్ వర్గీయులు ప్రయత్నిస్తున్నారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ విషయానికొస్తే.. గతంలో 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లపై కొండా దంపతులు చేసిన ఘాటు విమర్శల వల్ల, బీఆర్ఎస్ డోర్స్ వాళ్లకు ఎప్పుడో క్లోజ్ అయినట్లేనని పొలిటికల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు.
పోనీ బీజేపీ వైపు చూద్దామంటే.. కమలం పార్టీ నుంచి ఇప్పటి వరకూ వీరికి ఎలాంటి అఫీషియల్ ఇన్విటేషన్ రాలేదని టాక్. అంతేకాదు, కొండా ఫ్యామిలీని పార్టీలోకి తీసుకోవడంపై బీజేపీ అధిష్టానంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే సురేఖ చేత(Konda Surekha) ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయించి, బై-ఎలక్షన్స్‌కి వెళ్లడానికి కొండా మురళి మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొండా సురేఖ పొలిటికల్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతోంది? ఆ బిగ్ అప్‌డేట్ ఏంటి అనేది త్వరలోనే తేలనుంది.
