Lok Sabha and Assembly: 50 శాతం పెరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు..ఏపీ, తెలంగాణలో భారీగా పెరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు

Lok Sabha and Assembly: భారత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగి దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి జనాభాకు, ఇప్పటి జనాభాకు చాలా వ్యత్యాసం వచ్చేసింది.

Lok Sabha and Assembly

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మొట్టమొదటిగా ఒక చారిత్రక ఘట్టానికి మోదీ సర్కార్ నాంది పలకబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ(Lok Sabha and Assembly) స్థానాలను ఏకంగా 50 శాతం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ(Lok Sabha and Assembly) స్థానాలకు సంబంధించిన కీలక బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్య 816కి చేరుకోబోతోన్నట్లు అవుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 4,123 నుంచి ఏకంగా 6,185కి పెరుగుతుంది.

అయితే ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే స్థానాలు 175 నుంచి 263కి, ఎంపీ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయి. తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు 119 నుంచి 179కి, ఎంపీ స్థానాలు 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్యంగా మూడు బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో మొదటిది, జనాభా పెరుగుదల. భారత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగి దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి జనాభాకు, ఇప్పటి జనాభాకు చాలా వ్యత్యాసం వచ్చేసింది.

దీనివల్ల ఒక్కో ఎంపీ , ఒక్కో ఎమ్మెల్యే పరిధిలో లక్షలాది మంది ఓటర్లు ఉంటున్నారు. దీంతో ప్రజలకు , ప్రజా ప్రతినిధులకు మధ్య దూరం పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నియోజకవర్గాల సంఖ్య పెంచడం వల్ల ప్రతినిధులు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని భావించింది.

ఇక రెండవది, పరిపాలనా సౌలభ్యం. నియోజకవర్గం పరిధి చిన్నదిగా ఉంటేనే అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలరు. అలాగే అభివృద్ధి పథకాలను పర్యవేక్షించడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది.

Lok Sabha and Assembly

మూడవది, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం. ఎందుకంటే ఇటీవల ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించాలి. ఇప్పుడున్న సీట్ల సంఖ్యను పెంచితే పురుష ప్రతినిధులకు నష్టం కలగకుండానే, మహిళలకు పెద్దపీట వేయొచ్చని కేంద్రం భావిస్తోంది.

అయితే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. అయితే సీట్ల పెంపు కంటే ముందుగా మహిళా రిజర్వేషన్ , డీలిమిటేషన్ చట్టాలకు అవసరమైన సవరణలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. ముందుగా ఈ కసరత్తు అంతా పూర్తయ్యాక 2029 సాధారణ ఎన్నికల సమయానికి ఈ కొత్త నియోజకవర్గాలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Conch Shell: పూజ గదిలో శంఖం ఉంటే మంచిదా? లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏది ఉంచాలి?

Exit mobile version