Amarnath Yatra : రేపటి నుంచే అమర్‌నాథుడి దర్శనం.. వెళ్లాలనుకుంటే మాత్రం ఈ 5 జాగ్రత్తలు పాటించాల్సిందే..

Amarnath Yatra : సముద్ర మట్టానికి దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో నేచురల్‌గా ఏర్పడే మంచు శివలింగాన్ని కళ్లారా చూడటానికి.. దేశం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

Amarnath Yatra

హిమాలయాల్లోని పవిత్రమైన బాబా బర్ఫానీని దర్శించుకునే టైమ్‌ వచ్చేసింది. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు సుమారు 57 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక జర్నీ సాగబోతోంది. సముద్ర మట్టానికి దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో నేచురల్‌గా ఏర్పడే మంచు శివలింగాన్ని కళ్లారా చూడటానికి.. దేశం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

అమర్‌నాథ్ పవిత్ర(Amarnath Yatra) గుహను చేరడానికి భక్తులకు రెండు దారులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటిది సాంప్రదాయకమైన పహల్గామ్ మార్గం. శ్రీనగర్ నుంచి దాదాపు 141 కి.మీటర్ల దూరంలో ఉండే ఈ మార్గంలో నడక కాస్త ఈజీగానే సాగుతుందని చెప్పొచ్చు. కాకపోతే గుహ వద్దకు వెళ్లడానికి మాత్రం దాదాపు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది.

ఇక అమర్‌నాథ్ గుహను చేరడానికి రెండో దారి బల్తాల్ మార్గం. ఇది కేవలం 14 కి.మీటర్ల దూరం మాత్రమే ఉన్నా, కొండలు చాలా నిటారుగా ఉండి నడవడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే బాడీ ఫిట్‌గా ఉన్నవారు అలాగే త్వరగా దర్శనం చేసుకోవాలనుకునే వారు ఒకే రోజులో ఈ జర్నీని పూర్తి చేసుకుంటారు.

ఎంతో పవిత్రమైన ఈ యాత్రకు వెళ్లాలంటే శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డు కొన్ని ప్రత్యేక కండీషన్లు పెట్టింది. ఈ యాత్రలో పాల్గొనే భక్తుల వయస్సు కచ్చితంగా 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు అలాగే ఆరు వారాల కంటే ఎక్కువ రోజులు ఉన్న గర్భిణీలకు ఈ ప్రయాణానికి అనుమతి ఉండదు.

పైకి వెళ్లేకొద్దీ కొండల మీద ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి కాబట్టి, ఏదైనా గుర్తింపు పొందిన ఆసుపత్రి నుంచి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ కార్డ్‌తో పాటు అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ముందే తమ పేరును ఎంటర్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు ఈ యాత్రకు అనుమతిస్తారు.

అయితే హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం కాబట్టి ప్రయాణీకులు తమ వెంట కొన్ని అత్యవసర వస్తువులను ప్యాక్ చేసుకోవాలి. చలి నుంచి ప్రొటెక్షన్ కోసం వెచ్చని ఉన్ని దుస్తులు, అకస్మాత్తుగా పడే వర్షాల కోసం గొడుగు ,రెయిన్‌కోట్ వంటివి వెంట తెచ్చుకోవాలి.

అలాగే మంచు కొండల్లో నడవడానికి వీలుగా ఉండే వాటర్‌ప్రూఫ్ బూట్లు, సూర్యరశ్మి , చలిగాలుల నుంచి స్కిన్‌ను రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్, రాత్రి వేళల్లో ఉపయోగపడేలా హెడ్‌ల్యాంప్ కానీ ఫ్లాష్‌లైట్ కానీ కచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. వీటికి తోడు నడకకు సపోర్ట్ ఇచ్చే ట్రెక్కింగ్ కర్ర, ఫోన్ తడవకుండా ఉండటానికి వాటర్‌ప్రూఫ్ మొబైల్ కవర్లతో పాటు పర్యావరణానికి హాని చేయని సంచులను మాత్రమే వెంట తీసుకెళ్లాలి.

Amarnath Yatra

కొండ ఎక్కే సమయంలో వికారం, తలనొప్పి, ఒంటినొప్పులు, ఫీవర్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైన ఫస్ట్‌ఎయిడ్ కిట్‌ను, రెగ్యులర్ మెడిసిన్స్‌ను తమతో ఉంచుకోవాలి.

అలాగే యాత్రా(Amarnath Yatra) మార్గంలో భద్రతా బలగాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుంటాయి కాబట్టి మీ ఆధార్ కార్డ్ , అధికారిక గుర్తింపు పత్రాలను, యాత్రా పర్మిట్ కాపీలను మీతోనే ఉంచుకోవాలి. ప్రయాణం సాఫీగా సాగడానికి తక్కువ లగేజ్‌ ఉండేలా చూసుకోండి. ఖరీదైన వస్తువులను, అనవసరమైన సామాన్లను ఇంటి వద్దే వదిలేసి ప్రశాంతంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆస్వాదించి రండి.

Date Of Birth : ఈరోజు వారికి కొత్త పరిచయాలు.. కానీ ఆ డేట్‌లో పుట్టినవారు మాత్రం కోపం తగ్గించుకోవాలి

Exit mobile version