Ekamukhi Rudraksha : అసలైన ఏకముఖి రుద్రాక్ష ఎలా ఉంటుంది?. నకిలీల గుర్తింపు ఎలా?

Ekamukhi Rudraksha : ఏకముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మోక్షం లభించడంతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు.

Ekamukhi Rudraksha

రుద్రాక్ష అంటే ఒక రకమైన పూసలు కాదు.. శివుని కంటి నీటి చుక్క అని పురాణాలు చెబుతాయి . రుద్రాక్షల్లో ఎన్నో రకాలు ఉన్నా, ఏకముఖి రుద్రాక్షకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇది సాక్షాత్తు పరమశివుడి స్వరూపంగా భావిస్తారు.

అయితే, దీనికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో మార్కెట్‌లో నకిలీ రుద్రాక్షలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. అసలైన ఏకముఖి రుద్రాక్ష(Ekamukhi Rudraksha)ను గుర్తించడం ఒక కళ అంటారు నిపుణులు. ఇది సాధారణంగా అర్ధ చంద్రాకారంలో ( జీడిపిక్క ఆకారంలో ) ఉంటుంది. దీని మీద పైనుంచి కింద వరకు ఒకే ఒక స్పష్టమైన గీత (లైన్) ఉంటుంది.

అసలైన రుద్రాక్షను గుర్తించడానికి కొన్ని తేలికయిన పరీక్షలు ఉన్నాయి. మొదటగా, స్వచ్ఛమైన రుద్రాక్షను నీటిలో వేస్తే అది మునిగిపోతుంది. కానీ అదే నకిలీవి లేదా ప్లాస్టిక్‌వి అయితే తేలుతాయి.

అలాగే, రుద్రాక్షను ఆముదంలో ఉంచితే.. అది మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించింది అంటే అది అసలైనదని అర్థం. నీటిలో వేసి మరిగించినప్పుడు కలర్ పోతే అది నకిలీ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీతో రుద్రాక్ష లోపల ఎన్ని గదులు ఉన్నాయో ఎక్స్-రే ద్వారా కూడా చూడొచ్చు. ఏకముఖి రుద్రాక్షలో ఒకే ఒక విత్తన గది (Seed Chamber) ఉంటుంది.

Ekamukhi Rudraksha

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏకముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మోక్షం లభించడంతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా సూర్య గ్రహ దోషాలున్నవారు, సింహరాశి వారు దీనిని ధరిస్తే మంచి ఫలితాలుంటాయట.

ఇది రక్తపోటును నియంత్రించడంలో, ఏకాగ్రతను పెంచడంలో కూడా సాయపడుతుందని చెబుతుంటారు. అయితే, రుద్రాక్షను కొనేటప్పుడు నమ్మకమైన మంచి వ్యాపారుల దగ్గర, సరైన ల్యాబ్ సర్టిఫికేట్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఏకముఖి రుద్రాక్ష(Ekamukhi Rudraksha) పూర్తి ఫలితం అందుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version