Astrology : జాతకం ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదా.. ఈ 4 సందర్భాల్లోనే చూపించాలా?

Astrology : జీవితంలో ఏం జరుగుతుందో పక్కాగా తెలుసుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలని పండితులు చెబుతుంటారు.

Astrology

నా లైఫ్ ఎలా ఉండబోతోంది? నేననుకున్న పనులన్నీ నెరవేరుతాయా లేదా? ఇలాంటి ఆలోచనలు చాలామంది మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఇలాంటివారు మన రాబోయే కాలాన్ని ముందే అంచనా వేయడానికి, వచ్చే కష్టాల నుంచి తప్పించుకోవడానికి జ్యోతిష్యం(Astrology) వైపు ఆసక్తి చూపిస్తారు.

ఆయా రాశులను బట్టి పైపైన రాశిఫలాలు చూసి మురిసిపోవడం కాకుండా, జీవితంలో ఏం జరుగుతుందో పక్కాగా తెలుసుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాతకం(Astrology) చూపించుకోవాలని పండితులు చెబుతుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా జీవితంలో కేవలం 4 సందర్భాల్లో మాత్రమే జాతకం చూపించుకుంటే మైండ్ బ్లాకింగ్ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

ఒక మనిషి చదువు, ఆ వ్యక్తి చేసే ఉద్యోగం, పెళ్లి, ఆ మనిషి దగ్గర డబ్బులు నిలుస్తాయా లేదా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక దివ్యమైన గైడ్ వంటిదే జాతకం.

ఒక మనిషి పుట్టిన సమయం, రోజు, తిథి, నక్షత్రం, వారం ప్రాతిపదికన రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పేదానినే జాతకం అంటారు. హిందూ ఆచారం ప్రకారం మనిషి భూమి మీద పుట్టగానే చాలామంది పెద్దలు..పండితుల చేత ప్రత్యేకంగా జన్మకుండలిని రాయించి పెట్టుకుంటారు.

వ్యక్తి పుట్టిన తేదీ,రోజు, నెల, ఇయర్‌తో పాటు అసలైన సమయంతో పాటు పుట్టిన ఊరు కచ్చితంగా తెలిసుండాలి. ఇక్కడ ముఖ్యంగా పుట్టిన టైమ్‌ అయితే నూటికి నూరుపాళ్లు సరిగ్గా ఉండాలి. ఎందుకంటే ఆ సమయం ఆధారంగానే ఆ వ్యక్తి లగ్నాన్ని నిర్ణయిస్తారు. లగ్నం కరెక్టుగా కుదిరితేనే పండితులు చెప్పే జాతక విశ్లేషణ కూడా అతి కచ్చితత్వంతో ఉంటుంది.

అయితే జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ఘట్టాల్లో మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి. వీటిలో మొదటిది.. బిడ్డ జన్మించిన వెంటనే జాతకం చూపించాలి. ఇలా చూపిస్తే వారికి ఏవైనా బాలారిష్ట దోషాలు లేదా గండాలు ఉంటే కనుక, మొదటి 21 రోజుల్లో కానీ తొలి ఏడాది దాటకముందు కానీ శాంతులు, పరిహారాలు జరిపించుకోవడం వల్ల ఆ దోషాలు పూర్తిగా తొలగిపోతాయని శాస్త్రం చెప్తోంది.

ఇక రెండో ముఖ్యమైన సందర్భం వివాహానికి ముందు జాతకం చూపించడం. అలా పెళ్లికి ముందే జ్యోతిష్యుడి వద్ద జాతక పొంతన, జాతక విశ్లేషణ చేయించుకుంటే.. వైవాహిక జీవితం అద్భుతంగా, సుఖసంతోషాలతో సాగిపోతుంది.

Astrology

మూడో సందర్భం విషయానికి వస్తే.. లైఫ్‌లో ఎప్పుడూ కష్టాలు ఎదురైనప్పుడు లేదా జాబ్ రాకపోయినా, పెళ్లి సంబంధాలు చెడిపోతున్నా, సంతాన లేమి వేధిస్తున్నా, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నా జాతక పరిశీలన చేయించుకోవాలి. దీనివల్ల గ్రహ దోష కారణాలు తెలిసి, తగిన పూజలు, పరిష్కారాలు చేయడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.

ఇక నాలుగోది.. ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం తలపెట్టినప్పుడు జాతకం చూపించాలి. ఉదాహరణకు ఉపనయనం, గృహప్రవేశం, ముహూర్తాలు పెట్టి చేసే శుభకార్యాల సమయంలో జాతకం చూపించుకుని నిర్ణయాలను తీసుకుంటే.. ఆ కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి.

Tai Chi Walk : ఫాస్ట్‌గా నడవాల్సిన పనిలేదు.. మైండ్‌,బాడీని రీఛార్జ్ చేసే తాయ్ చి వాకింగ్‌ చేయండి చాలు..

Exit mobile version