Cancer :కర్కాటక రాశి..వీరికి ఇది అదృష్ట సంవత్సరం అనాల్సిందే..

Cancer : కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి అనుకూలమైన సమయం. షేర్ మార్కెట్ పెట్టుబడులు వీరికి కలిసి వస్తాయి.

Cancer

ఆదాయం 2, వ్యయం 11
రాజపూజ్యం 4, అవమానం 7

పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి(Cancer) వారికి ఆదాయం 2, వ్యయం 11 వంతులుగా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7 వంతులుగా కనిపిస్తున్నాయి. ధనం, విద్య, సంతాన కారకుడైన గురుడు జన్మరాశిలో సంచరిస్తున్నా కూడా, ఇతర గ్రహాల బలం పుష్కలంగా ఉండటం వల్ల వీరికి ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా ఈజీగా అధిగమిస్తారు.

మీ శక్తి సామర్థ్యాలు పెరగడమే కాకుండా ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. అలాగే నూతన ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, ఊహించని అభివృద్ధి ఉంటుంది. అయితే స్వల్పంగా అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు పొంచి ఉండడంతో ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. తోబుట్టువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

ఉద్యోగస్తుల విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఇదొక సువర్ణ కాలమని చెప్పొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక గుర్తింపు, మన్ననలు పొందుతారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి యజమానుల నుంచి మంచి ప్రశంసలు అందుతాయి.

వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది కంటే మెరుగైన లాభాలొస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి అనుకూలమైన సమయం. షేర్ మార్కెట్ పెట్టుబడులు వీరికి కలిసి వస్తాయి. ఈ ఏడాది విలువైన స్థలాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగంలో ఉండేవారికి కూడా భారీ లాభాలు వస్తాయి.

Cancer

వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు బాగా పండి ఆదాయం పెరుగుతుంది. పాత అప్పులు తీర్చుకోవడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి గురు, శని ప్రభావం వల్ల అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి.

కర్కాటక రాశి(Cancer) స్త్రీలకు ఈ ఏడాది పట్టిందల్లా బంగారం అనేలా ఉంటుంది. కుటుంబంలో వారి మాటకు విలువ పెరుగుతుంది. ఓవరాల్‌గా ఈ రాశి వారికి పరాభవ నామ సంవత్సరం అత్యంత సుఖప్రదంగా ఉంటుందనే చెప్పొచ్చు. అయితే నరఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version