Gemini:మిథున రాశి ..పరాభవ నామ సంవత్సరంలో పట్టిందల్లా బంగారమే

Gemini:బుద్ధి , ధన కారకుడైన గురువుతో పాటు శని, కుజుడు, రాహువులు బలమైన స్థానాల్లో సంచరించడం వల్ల మిథున రాశి వారికి విశేషమైన యోగకాలం నడుస్తోంది.

Gemini

ఆదాయం 8 – వ్యయం 11
రాజపూజ్యం 1 – అవమానం 7

పరాభవ నామ సంవత్సరంలో మిథున(Gemini) రాశి వారికి ఆదాయం 8 వంతులు కాగా, వ్యయం 11 వంతులుగా ఉంది. రాజపూజ్యం 1 , అవమానం 7 వంతులుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మిథున రాశి వారికి గ్రహబలం చాలా అద్భుతంగా ఉంది. బుద్ధి , ధన కారకుడైన గురువుతో పాటు శని, కుజుడు, రాహువులు బలమైన స్థానాల్లో సంచరించడం వల్ల వారికి విశేషమైన యోగకాలం నడుస్తోంది.

ఆదాయం బాగుండటమే కాకుండా భార్యాభర్తలు కలిసి.. ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం వరిస్తుంది. నూతన గృహ నిర్మాణం, వాహన కొనుగోలు వంటి చిరకాల వాంఛలు ఈ పరాభవ నామ సంవత్సరంలో నెరవేరుతాయి. ముఖ్యంగా కుటుంబంలో వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా ఎక్కువగా చేస్తారు.

మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. గతేడాది కంటే ఈ ఏడాది మీకు రెట్టింపు ఫలితాలు అందుతాయి. పాత అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. శని బలం వల్ల ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తుల ద్వారా మీకు అదనపు ఆదాయం సమకూరుతుంది.

ఉద్యోగస్తుల విషయానికి వస్తే మిథున(Gemini) రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరిగే అవకాశముంది. నిరుద్యోగులు ఈ ఏడాది తమ కలల ఉద్యోగాన్ని సాధించే అవకాశముంది. ఆఫీసులో అధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుతాయి.

ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది యోగకాలం అనే చెప్పాలి. సంపాదన గణనీయంగా పెరగడంతో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు కూడా భారీ లాభాలనే ఆర్జిస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి ఈ ఏడాది గోల్డెన్ పీరియడ్ వంటిది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. క్రీడాకారులు గతేడాది కంటే మెరుగైన విజయాలు నమోదు చేస్తారు.

Gemini

కాగా వ్యవసాయదారులకు పరాభవ నామ సంవత్సరంలో రెండు పంటలు బాగా పండి ఆశించినట్లుగానే ఆదాయం లభిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ ఏడాది శని బలం తోడవ్వడం వల్ల ప్రజాదరణ పెరుగుతుంది. నామినేటెడ్ పదవులు లభించే అవకాశం ఉండటంతో.. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం వారిదే అవుతుంది. టీవీ , సినిమా రంగంలో ఉండేవారికి ఆదాయం బాగున్నా కొత్త ప్రాజెక్టులు తగ్గొచ్చు.

మరోవైపు మిథున రాశి(Gemini) స్త్రీలకు ఈ ఏడాదంతా మహోన్నతంగా ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది . విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. గతంలో విడిపోయిన దంపతులు ఈ ఏడాది మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారికి గ్రహబలం తోడవడంతో.. ఈ ఏడాది ఆనందంగా, విజయవంతంగా సాగిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version