Sree Charani
భారత మహిళల క్రికెట్లో తెలుగమ్మాయిల హవా పెరుగుతోంది. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగుతేజాలు దుమ్మురేపుతున్నారు. గతంలో మిథాలీరాజ్ మహిళల క్రికెట్ను ఏ స్థాయికి తీసుకెళ్లిందో అందరికీ తెలుసు. ఆమె స్ఫూర్తితో చాలా మంది ఇప్పుడు జాతీయ జట్టులో అదరగొడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటుతూ ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దూసుకెళుతున్నారు.
తాజాగా తెలుగమ్మాయి శ్రీచరణి(Sree Charani) చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం, ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా నిలిచింది. తాజాగా ప్రకటించిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది. కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా కొనసాగుతోంది.
జాతీయ జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే మ్యాచ్ విన్నింగ్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. గత ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచులోకి అడుగుపెట్టింది. నిజానికి చిన్నవయసులో బ్యాడ్మింటన్, ఖోఖో ఆడిన శ్రీచరణి, తన మేనమామ ప్రోత్సాహంతో క్రికెట్ వైపు అడుగులు వేసింది.
మొదట ప్లాస్టిక్ బాల్ తోనూ, తర్వాత టెన్నిస్ బాల్ తోనూ సొంత ఊరిలో ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలో అబ్బాయిలతో కలిసి గల్లీ క్రికెట్ లో మెరుపులు మెరిపించింది. మొదట పేసర్ గా కెరీర్ మొదలుపెట్టినా వికెట్లు రావడం లేదని గ్రహించి స్పిన్నర్ గా మారింది.
ఆ తర్వాత క్రికెట్ కోచింగ్ లో జాయిన్ కావడం, క్రమంగా జిల్లా, రాష్ట్రా స్థాయి టోర్నీలలో ఆడి అదరగొట్టింది. దేశవాళీ టోర్నీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడింది. అయితే చాలా మంది యువ క్రికెటర్లలాగానే శ్రీ చరణి(Sree Charani) కెరీర్ కు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ టర్నింగ్ పాయింట్ అయింది.
డబ్ల్యూపీఎల్ లో ఆమెను రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈటోర్నీలో తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని సత్తా చాటింది. అదే సమయంలో డబ్ల్యూపీఎల్ లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లతో కలిసి ఆడటం ద్వారా తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంది.
ముఖ్యంగా బ్యాటర్లపై ఒత్తిడి పెంచేవిధంగా బౌలింగ్ చేయడం శ్రీచరణి ప్రత్యేకత. లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా పిచ్ నుంచి వచ్చే టర్న్ ను అత్యుత్తమంగా ఉపయోగించుకుని వికెట్లు తీస్తోంది. 21 ఏళ్లకే టీమిండియాలో నమ్మదగిన స్పిన్నర్ గా మారింది. జట్టు స్కోరును కాపాడుకోవాలంటే కెప్టెన్ హర్మన్ ప్రీత్ తొలి ఆప్షన్ గా ఈ తెలుగమ్మాయి వైపే చూస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న శ్రీచరణి 3 మ్యాచ్ లలో 10 వికెట్లు తీసింది.
Pune Murder Case : ప్రమాదం కాదు పక్కా ప్లాన్..ప్రియుడి కోసం కాబోయే భర్తను చంపేసిన యువతి..
A monumental milestone! 🔝
Sree Charani's wicket-taking form takes her to the summit of the ICC Women's T20I Bowling Rankings for the very first time 1️⃣👏#TeamIndia | #WomenInBlue | #T20WorldCup pic.twitter.com/K0TE8h26mH
— BCCI Women (@BCCIWomen) June 23, 2026
Pune Murder Case : ప్రమాదం కాదు పక్కా ప్లాన్..ప్రియుడి కోసం కాబోయే భర్తను చంపేసిన యువతి..
