Lotus Seeds : లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి..శ్రావణమాసంలో వీటితో పూజ చేస్తే మీ ఇంట ధనవర్షమే..

Lotus Seeds : పూజ పూర్తయ్యాక కొన్ని తామర గింజలను మీ బీరువాలో లేదా మీరు వ్యాపారం చేసే ప్రదేశంలోని క్యాష్ బాక్స్‌లో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది.

Lotus Seeds

వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసంలో పూజ అనగానే అందరికీ పండ్లు, పూలు, పిండివంటలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఈ మాసంలో చేసే పూజలో అమ్మవారిని సంతోషపెట్టి మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను ఆకర్షించే ఒక పవర్ ఫుల్ ఎలిమెంట్ ఉందని చాలామందికి తెలీదు.

శ్రీ మహా లక్ష్మీ కొలువై ఉండేది తామర పువ్వులోనే కాబట్టి, తామర పూలతో పాటు తామర గింజలు అంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టం. ఉత్తర భారతదేశంలో ఈ తామర గింజలను కమల్ గట్టా అని పిలుచుకుంటారు. ఈ పవిత్రమైన గింజలను శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మీ పూజకు సరిగ్గా ఉపయోగిస్తే, మీ కుటుంబంలో ఐశ్వర్యానికి ఏమాత్రం లోటు ఉండదని పండితులు గట్టిగా చెబుతున్నారు.

పూజా విధానంలో ఈ తామర గింజలకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. వరలక్ష్మీ వ్రతం రోజు కానీ, శ్రావణమాసంలో కానీ చివరకు మామూలు శుక్రవారాలలో అయినా అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుతున్నప్పుడు 108 తామర గింజలతో అర్చన చేయడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పండితులు చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుందని అంటారు.

Lotus Seeds

అంతేకాకుండా పూజ పూర్తయ్యాక కొన్ని తామర గింజల(Lotus Seeds)ను మీ బీరువాలో లేదా మీరు వ్యాపారం చేసే ప్రదేశంలోని క్యాష్ బాక్స్‌లో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి, ఐశ్వర్యం స్థిరంగా మీ ఇంట్లోనే నిలిచిపోతుందని నమ్మకం. పూజ చేసిన ఈ గింజలను ఒక దారానికి గుచ్చి అందమైన మాలగా తయారుచేసి అమ్మవారి కలశానికి లేదా విగ్రహానికి కూడా అలంకరించొచ్చు.

అయితే ఈ పవిత్రమైన తామర గింజలు మీ ఇంటికి దగ్గర్లో ఉండే పూజా సామగ్రి దుకాణాల్లో చాలా ఈజీగా లభిస్తాయి. ఒకవేళ బయట దొరక్కపోతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో కమల్ గట్టా సీడ్స్ ఫర్ పూజ (Kamal Gatta seeds for pooja) అని సెర్చ్ చేస్తే 108 గింజలు ఉన్న ప్యాకెట్లు ఈజీగా లభిస్తాయి. ఈ శ్రావణ మాసంలో చేసే.. లక్ష్మీ దేవి పూజలో వీటిని ఉపయోగించి అమ్మవారి పరిపూర్ణ కృపను పొందండి.

Sravana Masam Prasadam : శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ ప్రసాదం చేసి పెట్టండి..లక్ష్మీదేవి కటాక్షం ఖాయం

Exit mobile version