Money Plant :మనీ ప్లాంట్‌ను ఇలాంటి పాత్రలలో నాటితే కష్టాలు తప్పవు..ఈ వాస్తు టిప్స్ మీకోసమే

Money Plant: మనీ ప్లాంట్‌ను గాజు సీసాలో కానీ, మట్టి కుండలో నాటడం కానీ అత్యంత శుభప్రదం. అలాగే దీనిని ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశ వద్ద, ప్రధాన ద్వారం వద్ద పెంచుకోవాలి.

Money Plant

జ్యోతిష్య , వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ మొక్కకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంటిలో మనీ ప్లాంట్ ఉంటే లక్ కలిసి వస్తుందని, సంపద వృద్ధి చెందుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే, ఈ మనీ ప్లాంట్‌ను నాటే విషయంలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు.. మీ జీవితాన్ని తలకిందులు చేయగలవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా చాలా మంది అందం కోసం, అలాగే ఈజీగా పెంచుకోవడానికి ఉంటుందని ప్లాస్టిక్ కుండీలలో మనీ ప్లాంట్‌(Money Plant)ను నాటుతూ ఉంటారు. కానీ ప్లాస్టిక్ పాత్రలలో ఈ మొక్కను పెంచడం వాస్తు ప్రకారం అస్సలు మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్ అనేది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందట. ఇది మనీ ప్లాంట్ ఇచ్చే సానుకూల శక్తిని తగ్గించి ఇంట్లో సమస్యలకు కారణం అవుతుంది. అలాగే, మనీ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మురికిగా ఉన్న పాత్రలలో కానీ పగిలిపోయిన సీసాలలో కానీ నాటకూడదు.

ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా పని చేసినా దానిలో అడ్డంకులు ఏర్పడటం, కుటుంబంలో సామరస్యం దెబ్బతినడం వంటివి జరగొచ్చట.

Money Plant

మనీ ప్లాంట్‌(Money Plant)ను గాజు సీసాలో కానీ, మట్టి కుండలో నాటడం కానీ అత్యంత శుభప్రదం. అలాగే దీనిని ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశ వద్ద, ప్రధాన ద్వారం వద్ద పెంచుకోవాలి. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ కిందకు వేలాడకూడదు, అవి ఎల్లప్పుడూ పైకి పాకేలా చూసుకోవాలట. ఎందుకంటే

తీగలు కిందకు వేలాడితే అది ఆర్థిక నష్టానికి సంకేతమని వాస్తు శాస్త్రం చెబుతోంది. సరైన పాత్రలో, సరైన దిశలో మనీ ప్లాంట్‌ను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు , సంపద పెరుగుతాయని చెబుతోంది.

Children:తల్లిదండ్రులు,బంధువుల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది? వారి ఫ్యూచర్‌ను డిసైడ్ చేసేది ఎవరు?

Exit mobile version