Navagrahas : శ్రీ వేంకటేశ్వరుడి గుడిలో నవగ్రహాలు ఎందుకుండవు? నవగ్రహ ప్రదక్షిణల తర్వాత కాళ్లెందుకు కడగాలి?

Navagrahas : శివాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో మాత్రం కనిపించే నవగ్రహ మండపం.. వైష్ణవ దేవాలయాల్లో మాత్రం ఎందుకు ఉండదనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది.

Navagrahas

సాధారణంగా మనం ఏ గుడికి వెళ్లినా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి, ఆ నవగ్రహ దోషాలు తొలగిపోవాలని కోరుకుంటాం. కానీ శ్రీ వేంకటేశ్వరుడి ఆలయం, విష్ణుమూర్తి, శ్రీరాముడి గుడిలో కానీ ఒక్క నవగ్రహ విగ్రహం కూడా కనిపించదు.

శివాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో మాత్రం కనిపించే నవగ్రహ(Navagrahas) మండపం.. వైష్ణవ దేవాలయాల్లో మాత్రం ఎందుకు ఉండదనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. దీని వెనుకున్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏంటనే దానిపై పండితులు వివరించారు. అలాగే నవగ్రహాల చుట్టూ తిరిగాక కాళ్లు కడగాలా వద్దా అనే సందేహాలను కూడా తొలగించారు.

నిజానికి ‘గ్రహం’ అంటే మనలోని శక్తులను తనవైపు లాక్కునేది లేదంటే ఆకర్షించేది అని అర్థం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయానా సమస్త గ్రహాలలో భాస్కరుడైన ఆదిత్యుడిని నేనే అని చెప్పడం మనకు తెలుసు. అంటే ఈ నవగ్రహా(Navagrahas)లన్నింటికీ కూడా మూలశక్తి, ఆ గ్రహ రూపం సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే అని అర్ధం.

అటువంటపుడు మూలమూర్తిగా ఆ స్వామివారే కొలువుదీరిన ఆలయంలో, మళ్లీ ప్రత్యేకంగా నవగ్రహ(Navagrahas) విగ్రహాలను పెట్టాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. అందుకే పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారమే శ్రీనివాసుడు, విష్ణువు, రాముని ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేయరు.

మనిషి తనలోని నిగ్రహాన్ని అంటే ఓపిక, క్రమశిక్షణ పెంచుకోవడానికే ఈ నవగ్రహ ఆరాధన ఉపయోగపడుతుంది.అయితే ఈ నవగ్రహ ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా వద్దా? అనే అనుమానం చాలామందిని వేధిస్తుంటుంది.

Navagrahas

నిజానికి మన ధర్మశాస్త్రాల్లో నవగ్రహ ప్రదక్షిణ తర్వాత కచ్చితంగా కాళ్లు కడుక్కోవాలని ఎక్కడా ప్రత్యేకంగా రాసి లేదు. కానీ దీని వెనుక ఒక ప్రాక్టికల్ రీజన్ మాత్రం ఉంది. శనిదేవుడికి అందరూ నూనెతో తైలాభిషేకాలు చేయడం వల్ల ఆ మండపమంతా జిడ్డుగా మారుతుందన్న సంగతి తెలిసిందే.

భక్తులు నవగ్రహ ప్రదక్షిణలు చేసినప్పుడు కాళ్లకు ఆ నూనె అంటుకుంటుంది. దాని తర్వాత కాళ్లు శుభ్రం చేసుకోకుండా అలాగే ఆలయంలోకి వెళ్తే కాళ్లు జారి కింద పడే ప్రమాదం ఉంటుంది. అందుకే సురక్షితంగా ఉండటానికే ప్రదక్షిణల తర్వాత కాళ్లు కడుక్కుని దర్శనానికి వెళ్లాలని పెద్దలు చెప్పేవారని అది కాస్తా ఆచారంగా మారిపోయిందని వేద పండితులు వివరిస్తున్నారు.

Cinnamon Coffee : దాల్చిన చెక్క కాఫీ టేస్ట్ చేశారా? బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు..

Exit mobile version