Northeast:మీ ఇంట్లో ఈశాన్యం మూల ఇలా ఉందా? అయితే ఆర్థిక కష్టాలు వెంటాడతాయట..

Northeast :ఈశాన్యం మూలలో చెత్తాచెదారం ఉంచడం వల్ల ఇంట్లోని వారి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.

Northeast

చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు ఫేసింగ్ చూస్తారు కానీ, ఇంట్లో వస్తువులను అమర్చేటప్పుడు మాత్రం వాస్తు నియమాలను సరిగా పట్టించుకోరు. అయితే ఇంటికి ఈశాన్యం ( Northeast ) అనేది అత్యంత పవిత్రమైన మూల కాబట్టి దీని గురించి పట్టించుకోవాల్సిందేనని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనిని దేవ మూల అని కూడా అంటారట.

మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోయినా.. ఒక్కసారి మీ ఇంటి ఈశాన్యం ( Northeast)మూలను గమనించాలట. ఈ మూల కనుక బరువుగా ఉంటే, అంటే అక్కడ పాత సామాన్లు, ఇనుప వస్తువులు , భారీ అల్మారాలు వంటివి ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.

ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా, వెలుతురుతో నిండి ఉండాలి. అంతే కాదు ఆ మూలలో చెత్తాచెదారం ఉంచడం వల్ల ఇంట్లోని వారి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం వివరిస్తోంది.

Northeast

ఈశాన్యం మూలలో మెట్లు ఉండటం , టాయిలెట్స్ నిర్మించడం వంటివి అసలు చేయకూడదట. అవి వాస్తు రీత్యా అతిపెద్ద దోషాలుగా పరిగణించబడతాయట. ఒకవేళ పొరపాటున అక్కడ మెట్లు ఉంటే, ఆ నెగటివ్ ఎనర్జీని తగ్గించడానికి అక్కడ చిన్న చిన్న నీటి పాత్రలు లేదా ఇండోర్ ప్లాంట్స్ ఉంచాలి.అలాగే ఈ మూలలో ప్రతిరోజూ దీపం వెలిగించడం వల్ల..పాజిటివ్ పవర్ పెరుగుతుంది.

అలాగే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలను అమర్చుకోవడం వల్ల కూడా ఆ ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. కేవలం సొంతింట్లో ఉన్నవారు మాత్రమే కాకుండా, అద్దె ఇంట్లో ఉండేవారు కూడా తమ ఫర్నిచర్ వంటివి ఈశాన్యంలో కాకుండా నైరుతి (సౌత్-వెస్ట్)వైపు సర్దుకోవడం వల్ల వాస్తు దోషాల నుంచి తప్పించుకోవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అవి మీ జీవితంలో ఊహించని శుభ ఫలితాలను తీసుకువస్తాయని వాస్తు పండితులు వివరిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version