Asian Games 2026
ఆసియా క్రీడల వార్ మొదలవ్వడమే ఆలస్యం.. మన భారతీయ అథ్లెట్లు మైదానంలోకి దిగి పతకాల వేట స్టార్ట్ చేసేశారు. ఫస్ట్ డేనే మనోళ్లు అకౌంట్ తెరిచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. విమెన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో మన షూటర్లు గన్స్ గురిపెట్టి అద్భుతమైన రజత పతకాన్ని కొల్లగొట్టారు.
ఇలవేనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్సా వినోద్‌తో కూడిన భారత త్రిమూర్తుల టీమ్ డ్రాగన్ కంట్రీ చైనా తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచి సిల్వర్ మెడల్‌ను ముద్దాడింది. ఈ ప్రెస్టీజియస్ టోర్నీలో ఇండియా సాధించిన మొట్టమొదటి మెడల్ ఇదే కావడం విశేషం.
ఒక్క షూటింగ్‌లోనే కాదు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) కేటగిరీలో కూడా మన అమ్మాయి చరిత్ర పుటలకెక్కింది. సుచిక తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి రికార్డ్ క్రియేట్ చేసింది. క్వార్టర్ ఫైనల్ పోరులో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించడమే కాకుండా, ఎంఎంఏ కేటగిరీలో భారత్‌కు తొలి పతకాన్ని పక్కాగా ఖాయం చేసిపెట్టింది.
ఇక మహిళల హాకీ టీమ్ మైదానంలో పూనకం వచ్చినట్లు ఆడేసింది. తమ ఆరంభ పూల్ మ్యాచ్‌లోనే ఉజ్బెకిస్తాన్‌పై 19-0 గోల్స్ తేడాతో ఊహకందని ఘన విజయాన్ని నమోదు చేసి ఒక ప్రభంజనం క్రియేట్ చేసింది. ప్రత్యర్థికి ఒక్క గోల్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా పాయింట్ల వర్షాన్ని కురిపిస్తూ తమ గోల్డ్ మెడల్ ప్రచారాన్ని గ్రాండ్‌గా రీ-స్టార్ట్ చేసింది.
అయితే క్రీడల్లో గెలుపోటములు కామనే అన్నట్లు, కొన్ని ఈవెంట్లలో మాత్రం మనకు నిరాశే ఎదురైంది. పురుషుల చాంగ్‌క్వాన్ ఫైనల్ రౌండ్‌లో పోటీపడ్డ సూరజ్ సింగ్ 11 ప్లేస్‌తో సరిపెట్టుకోవడంతో పతకం ఆశలు చేజారిపోయాయి. మరోవైపు టెక్‌బాల్‌లోనూ భారత్ అథ్లెట్లకు లక్ కలిసి రాలేదు. మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ పోటీల్లో భారత ప్లేయర్లు తీవ్రంగా శ్రమించినా లాస్ట్ మినిట్‌లో ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం స్పోర్ట్స్ లవర్స్ అందరి చూపు విమెన్ క్రికెట్ టీమ్ పైనే ఉంది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చోటు దక్కించుకోవడమే టార్గెట్‌గా, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్ సెమీఫైనల్ బిగ్ ఫైట్‌లో బంగ్లాతో తలపడటానికి సిద్ధమైంది. ఫస్ట్ డే ఊపు చూస్తుంటే.. ఈసారి ఆసియా క్రీడల్లో(Asian Games 2026 )మనోళ్లు మెడల్స్ పంట పండించడం గ్యారీంటీగా కనిపిస్తోంది.
Elon Musk Neuralink : పెదవి విప్పకుండానే ఐ లవ్ యూ..ఆలోచనలకు వాయిస్ ఇచ్చిన ఎలాన్ మస్క్ టెక్నాలజీ..
