Bhuvneshwar Kumar : నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్.. చిన్నస్వామిలో రీఎంట్రీ ఫిక్స్..

Bhuvneshwar Kumar : న్యూజిలాండ్ సిరీస్ కంటే ముందే భువీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Bhuvneshwar Kumar

టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చాలా కాలం తర్వాత మళ్లీ నేషనల్ టీమ్ జెర్సీ ధరించడానికి రెడీ అయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్ కంటే ముందే భువీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా వెస్ట్ ఇండీస్‌తో జరగబోతున్న నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్‌లోనే భువీకి ఫైనల్ జట్టులో ఛాన్స్ దక్కే సూచనలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. నిజానికి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ ఆడి దాదాపు నాలుగేళ్లు అయింది.

అయితే భువీ ఎంట్రీ వెనుక ఓ మెయిన్ రీజన్ ఉంది. ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా విండీస్ పేసర్ షమార్ జోసెఫ్ వేసిన ఫాస్టెస్ట్ బాల్ .. యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ భుజానికి బలంగా తాకింది. ఈ నొప్పితో ఇబ్బంది పడిన అతడు రిటైర్డ్ ఔట్‌గా క్రీజును వీడాడు.

ప్రస్తుతం అర్ష్‌దీప్ జట్టుతోనే ఉన్నా కూడా, అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఆఖరి మ్యాచ్‌లో అతడు ఆడేది లేనిది మ్యాచ్ టైమ్‌కు మాత్రమే తేలనుంది. సిరీస్ ప్రస్తుతం 2-2తో ఈక్విల్‌గా ఉండటంతో, సిరీస్ డిసైడర్ అయిన ఐదో మ్యాచ్ కోసం ముందు జాగ్రత్తగా బీసీసీఐ భువనేశ్వర్ కుమార్‌ను స్క్వాడ్‌లోకి అర్జంటుగా పిలిపించింది.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భువనేశ్వర్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్‌లతో చిన్నస్వామి పిచ్‌పై పూర్తి అవగాహన ఉన్న భువీ, తన హోమ్ గ్రౌండ్‌ వంటి వేదికపై చెలరేగిపోవాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు.

విండీస్‌తో ఆఖరి టీ20కి భారత స్క్వాడ్‌లో ..శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్‌ దూబే, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు.


Ranabaali : విజయ్ దేవరకొండ మాస్ రౌద్రం.. రణబాలి ఎలా ఉందంటే..

↑
Exit mobile version