Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైనల్ ధమాకా..సౌత్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్ టైటిల్ వార్‌లో మెరిసెదెవరు?

Duleep Trophy : బీసీసీఐ నిబంధనల ప్రకారం దులీప్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచే టీమ్‌కి రూ.కోటి ప్రైజ్ మనీ లభిస్తుంది.

Duleep Trophy

దేశవాళీ క్రికెట్‌లో చాలా ప్రెస్టీజియస్‌గా సాగే దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరు.. ఇప్పుడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఫుల్ జోష్‌లో సాగుతోంది. సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి ఈరోజు వరకూ అంటే 10 వ తేదీ వరకు ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య టైటిల్ కోసం హోరాహోరీ ఫైట్ నడుస్తోంది.

మైదానంలో ట్రోఫీని ముద్దాడటానికి రెండు టీమ్‌లు చెమటోడుస్తుంటే.. క్రికెట్ అభిమానులు మాత్రం ఈ ప్రతిష్టాత్మక టోర్నీ విజేతకు దక్కే భారీ ప్రైజ్ మనీ వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం దులీప్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచే టీమ్‌కి.. ఏకంగా రూ.కోటి ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇక టైటిల్ పోరులో రన్నరప్‌గా నిలిచే టీమ్ కూడా నిరాశపడకుండా వారికి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ దక్కుతుంది.

అయితే బోర్డు ఇచ్చే ఈ భారీ క్యాష్ ప్రైజ్ మనీ మొత్తం కేవలం కెప్టెన్‌కో, ఒకరిద్దరు స్టార్ ప్లేయర్లకు మాత్రమే ఇవ్వరు. ఇది విన్నర్ టీమ్‌కు దక్కే జాయింట్ బహుమతి. నిబంధనల ప్రకారం ఈ ప్రైజ్ మనీని జట్టులోని ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్, కోచింగ్ టీమ్ అందరి మధ్య నిర్ణీత నిష్పత్తిలో ఈక్వల్‌గా పంపిణీ చేస్తారు.

ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్‌లో విజేతలకు చాలా తక్కువ అమౌంట్ దక్కేది. కానీ బీసీసీఐ 2023లో ప్రైజ్ మనీ సిస్టమ్‌లో రెవల్యూషనరీ ఛేంజెస్ తీసుకొచ్చి, విన్నర్ ప్రైజ్‌ మనీని రూ.40 లక్షల నుంచి ఏకంగా రూ. కోటికి, రన్నరప్ ప్రైజ్‌ మనీ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ఈ డెసిషన్ వల్ల దేశవాళీ క్రికెటర్లకు ఫైనాన్షియల్‌గా మంచి సపోర్ట్‌ దొరికినట్లు అయింది.

Duleep Trophy

కాగా ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ ఊచకోత కోశాడు. కెప్టెన్సీ బాధ్యతలే కాకుండా బ్యాట్‌తో విరుచుకుపడుతూ ఏకంగా 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగుల భారీ డబుల్ సెంచరీతో మైదానంలో మెరిశాడు.

సుమారు 2 రోజుల పాటు క్రీజులో పాతుకుపోయి.. తన టీమ్‌ను తిరుగులేని పొజిషన్‌లో నిలబెట్టాడు. ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌లలో ఈరోజు ఏ జట్టు ఛాంపియన్‌గా నిలిచి.. మెరిసే ట్రోఫీతో పాటు రూ.కోటి చెక్‌ను తీసుకుంటుందో చూడాలి మరి.

Obsession : ఇష్టం హద్దులు దాటితే లవ్ కాదు..ఒకరిపైనే ఎందుకు అంతగా ఫిక్సేట్ అవుతారు?

Exit mobile version