Gambhir : సీనియర్ల కంటే యువ ఆటగాళ్లకే ప్రాధాన్యత..గంభీర్ వ్యూహం సరైనదేనా ?

Gambhir : 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ, సెలక్టర్లు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో సీనియర్లు రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Gambhir

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్(Gambhir) బాధ్యతలు స్వీకరించిన తర్వాత, టీ20, వన్డే ఫార్మాట్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల భవితవ్యంపై క్రీడా వర్గాల్లో, జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ, సెలక్టర్లు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో సీనియర్లు రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు జట్టులో సీనియర్లకు విలువ తగ్గిపోయిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గంభీర్ శైలి కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లలో అభద్రతా భావం పెరిగిందని, తరచూ తుది జట్టులో మార్పులు చేయడం వల్ల జట్టు సమతుల్యత దెబ్బతింటోందని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.

హెడ్ కోచ్ తీరుపై విసిగిపోయిన కొందరు సీనియర్ ఆటగాళ్లు, గంభీర్‌ను పక్కనపెట్టి నేరుగా బీసీసీఐ పెద్దలను కలిసి తమ భవిష్యత్తు గురించి చర్చించిన సందర్భాలను కూడా చూసాం. ఒకవైపు టీ20 ఫార్మాట్‌లో మంచి విజయాలు సాధించినా సరే, వన్డేల్లో మాత్రం సీనియర్లను పక్కన పెట్టడం, యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేయడం వంటి మొండి వైఖరి.. జట్టును కొన్నిసార్లు దెబ్బతీసిందని విమర్శలు ఉన్నాయి.

శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్ల చేతిలో భారత్ వన్డే సిరీస్‌లు ఓడిపోవడం గంభీర్(Gambhir) వ్యూహాలపై సందేహాలకు తావిచ్చింది. పూర్తి యువ జట్టుతోనే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో మంచి ఫలితాలు సాధించడం సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

Gambhir

వరల్డ్ కప్‌లలో సీనియర్ ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకం. వారి అనుభవం, ఒత్తిడిని తట్టుకునే మానసిక ధైర్యం, క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ లేదా బౌలింగ్ తీరు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే జట్టులో సీనియర్లకు కూడా ప్రాధాన్యత ఉండాలని మాజీలు , విశ్లేషకులు సూచిస్తున్నారు.

టీ20ల్లో ప్రణాళికలు బాగానే పనిచేసినా, వన్డే ఫార్మాట్‌లో మాత్రం సీనియర్ల అనుభవాన్ని పూర్తిగా పక్కన పెట్టడం సరైనది కాదని, వారిని కూడా లూప్‌లో ఉంచుకుంటూ ముందుకు వెళితేనే జట్టు సమతుల్యత బాగుంటుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

Love : మీ ప్రేమలో స్వార్థం ఉండాలా? వద్దా?.. భగవద్గీత ఇచ్చే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఏంటి?

Exit mobile version