Alyssa Healy : సెంచరీతో వీడ్కోలు..కెరీర్ ముగించిన అలీసా హీలీ

Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ ఎలిస్సా హీలీ తన వన్డే కెరీర్‌కు చాలా గ్రాండ్‎గా వీడ్కోలు పలికారు. హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆమె ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇది ఆమె కెరీర్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ కావడం విశేషం.

Alyssa Healy

మహిళల క్రికెట్ లో సుధీర్ఘ కాలం కొనసాగడం అంత ఈజీ కాదు. ఎందుకంటే గాయాలను తట్టుకుని, ఫిట్ నెస్ కాపాడుకుంటూ 16 ఏళ్ల పాటు ఆడడం అంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి అరుదైన ఘనత ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ(Alyssa Healy)కే దక్కుతుంది. మహిళల క్రికెట్ లో దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఆమె తన క్రికెట్ కెరీర్ ను సగర్వంగా ముగించింది. భారత్ తో సొంతగడ్డపై జరిగే సిరీసే తనకు చివరిదని ముందే ప్రకటించిన హీలీ మూడో వన్డేలో అద్భుత శతకం సాధించింది.

158 పరుగులతో ఆసీస్ భారీస్కోరు సాధించడంలో తనదైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఫేర్ వెల్ మ్యాచ్ కావడంతో భారత క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. అలీసా హీలీ(Alyssa Healy) భర్త , ఆసీస్ పేసర్ మిఛెల్ స్టార్క్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా మ్యాచ్ కు హాజరయ్యారు. దీంతో ఒకవిధమైన ఉద్వేగపూరితమైన వాతావరణం నెలకొంది.

ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 2010లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తను తొలి మ్యాచ్ ఆడింది. వికెట్ కీపర్‌గా, విధ్వంసక ఓపెనర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీలీ మూడేళ్ల క్రితం కెప్టెన్సీ చేపట్టింది.

Alyssa Healy

మెగ్ లానింగ్ వారసురాలిగా బాధ్యతలు తీసుకున్న హీలీ 16 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రికార్డులు, అద్భుత విజయాలు సాధించింది. హీలీ సారథ్యంలోనే ఆసీస్ జట్టు గత టీ20 ప్రపంచకప్ లో , 2025 వన్డే ప్రపంచకప్ లో సెమీఫైనల్ వరకూ చేరింది. 19 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అలీసా హీలీ తన కెరీర్ లో ఇప్పటి వరకూ 162 టీ20లు, 126 వన్డేలు, 11 టెస్టులు ఆడింది. ముఖ్యంగా వికెట్ల వెనుక ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చురుగ్గా కదులుతూ టీ20ల్లో 126 మందిని ఔట్ చేసింది.

గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు చేయడంతో హీలీ డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఏ ఫ్రాంచైజీ కూడా ఆమెను పట్టించుకోలేదు. బహుశా రిటైర్మెంట్ ముంగిట ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోవడం హీలీని బాగా హర్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్పుడే వీడ్కోలుకు సమయం వచ్చిందని గ్రహించిన ఈ ఆసీస్ దిగ్గజం రిటైర్మెంట్ ఇచ్చేసింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version