IND vs ENG
వేదిక మారింది..భారత్ ఆటతీరు మాత్రం మారలేదు.. మళ్లీ అదే చెత్త బ్యాటింగ్..పేలవమైన బౌలింగ్..వెరసి నాలుగో టీ ట్వంటీలోనూ ఘోర పరాజయం పాలైన టీమిండియా సిరీస్‌ను చేజార్చుకుంది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లాండ్ 3-0 తో సిరీస్ కైవసం చేసుకోవడంతో.. ఇంగ్లాండ్(IND vs ENG)పై 14 ఏళ్లుగా ఉన్న అజేయ సిరీస్ రికార్డును కూడా చేజార్చుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ హర్షిత్ రాణా గాయాల వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. వారి స్థానంలో వాసింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు.
మరోసారి భారత టాప్ ఆర్డర్ వైఫల్యం కొంప ముంచింది. ఓపెనర్లు తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కేవలం 15 పరుగులకే వెనుదిరిగాడు . ఇషాన్ కిషన్ ఇంగ్లాండ్ పిచ్‌లపై వచ్చే అదనపు బౌన్స్‌ను ఎదుర్కోలేక వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.
పవర్‌ప్లే ముగిసిన వెంటనే జోరు మీదున్న అభిషేక్ శర్మ కూడా అదిల్ రషీద్ అద్భుత క్యాచ్‌కు అవుట్ కావడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. మిడిల్ ఆర్డర్ బాధ్యతారాహిత్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. వికెట్లు పడుతున్న సమయంలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాల్సిన మిడిల్ ఆర్డర్, పిచ్ కండిషన్స్‌కు అలవాటు పడటంలో పూర్తిగా విఫలమైంది.
శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో పోరాడాడు. దూబేతో కలిసి 53 పరుగులు , తిలక్ వర్మతో కలిసి 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తిలక్ వర్మ కూడా అనుకున్న విధంగా ఆడలేకపోయాడు. ఇంగ్లాండ్ పేస్ బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్‌ను కట్టడి చేశారు. దీంతో టీమిండియా 158 పరుగులకే పరిమితం అయింది.
శ్రేయాస్ అయ్యర్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.తర్వాత లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ దుమ్ము రేపింది. బట్లర్ త్వరగానే ఔట్ అయినా బ్రూక్, సాల్ట్ అదరగొట్టారు.భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు.
బ్రూక్ కేవలం 35 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫిల్ సాల్ట్ 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు.దీంతో ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది.
CM Vijay : సామాన్యుల సమస్యలపైనే దృష్టి.. పాలనలో సీఎం విజయ్ మార్క్
