IND vs ZIM
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ఇప్పుడు జింబాబ్వేతో(IND vs ZIM) సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ హరారే వేదికగా గురువారం జరగనుంది.
ఈ పర్యటనలో భారత జట్టు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. శ్రేయాస్ అయ్యర్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జింబాబ్వేను తక్కువ అంచనా వేయకుండా పూర్తిస్థాయి ప్రదర్శనతో సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది.
బీసీసీఐ గంభీర్‌కు విశ్రాంతి నివ్వడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే జింబాబ్వేతో సిరీస్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి కీలకంగా మారింది. తొలి రెండు సిరీస్‌లలోనూ సారథిగా నిరాశపరిచిన అయ్యర్ జట్టును ఎలా నడిపిస్తాడనేది చూడాలి.
కాగా ఈ సిరీస్‌లోనూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే అందరి చూపు ఉంది. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి 15 ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికైన వైభవ్ ఇంగ్లాండ్ టూర్‌లో విఫలమయ్యాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేయడానికి జింబాబ్వే టూర్ వైభవ్‌కు అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు.
వైభవ్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా, తెలుగుతేజం తిలక్ వర్మకు కూడా ఈ సిరీస్ కీలకంగా మారింది. గత రెండు సిరీస్‌లోనూ తిలక్ నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్ , ప్రభ్ సిమ్రన్ సింగ్‌లో ఒకరికి చోటు దక్కనుంది. బ్యాటింగ్‌లో ఆల్ రౌండర్లు రింకూ సింగ్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గేలపై అంచనాలున్నాయి.
అటు బౌలింగ్‌లో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్‌ను నడిపించనున్నారు. అలాగే స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, హర్ష్ దూబే కీలకం కానున్నారు. మరోవైపు చాలా మంది ఐపీఎల్ స్టార్లు ఉన్నా సరే, జింబాబ్వే తమ సొంతగడ్డపై ఎటువంటి ప్రత్యర్థికైనా షాక్ ఇచ్చే సత్తా ఉన్న జట్టుగా చెప్పొచ్చు.
ముజరబానీ,రిచర్డ్ న్గారవా వంటి బౌలర్లు, కెప్టెన్ సికందర్ రజా ఆ జట్టుకు ప్రధాన బలం. గత రికార్డులను చూస్తే భారత్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్ల మధ్య 14 టీ20 మ్యాచ్‌లు జరగగా భారత్ 11 మ్యాచ్‌లలో గెలిచింది. జింబాబ్వే మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. చివరిసారిగా 2024లో ఇక్కడ పర్యటించిన భారత్ గిల్ సారథ్యంలో 4 టీ20లను గెలిచింది.
Samsung Galaxy Z Flip 8 : ట్రెండీ లుక్‌తో అదుర్స్..మార్కెట్‌లో క్రేజీగా శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు
