RCB vs SRH
ఐపీఎల్ 2026 సీజన్ హై వోల్టేజ్ ఫైట్ తో ఆరంభం కాబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్(RCB vs SRH) తలబడబోతున్నాయి. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ హోంగ్రౌండ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్ ను అదిరిపోయే విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. కె
ప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీకి ప్రధాన పేస్ బౌలర్ హ్యాజిల్ వుడ్ ఈ మ్యాచ్ కు దూరమవడం ఎదురుదెబ్బగానే చెప్పాలి. అయితే మిగిలిన జట్టులో మాత్రం పలువురు కీలక ప్లేయర్లున్నారు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్లుగా ఆడనున్నారు. గత సీజన్ లో ఈ జోడీ పలు మెరుపు ఇన్నింగ్స్ లతో అద్భుతమైన ఆరంభాలనిచ్చింది. ఆర్సీబీ టైటిల్ విజయంలో సాల్ట్ – కోహ్లీ జోడీ కీలకపాత్ర పోషించింది.
దీంతో మరోసారి ఈ ఓపెనింగ్ జంటపై అంచనాలున్నాయి. అలాగే కెప్టెన్ పాటిదార్ , దేవదత్ పడిక్కల్ , జాకబ్ బెథల్ కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లో కీలకంగా ఉన్నారు. మిడిలార్డర్ లో జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించేది వీరే. అటు చివర్లో ఫినిషర్లుగా టిమ్ డేవిడ్ తో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా దుమ్మురేపడం ఖాయం. ముఖ్యంగా జితేశ్ శర్మ గత సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ లు ముగించాడు. హోంగ్రౌండ్ లో పిచ్ కండీషన్స్ ను ఉపయోగించుకోవడంలో జితేశ్ శర్మ ఆరితేరాడు. దీంతో ఆర్సీబీ ఫినిషర్ గా జితేశ్ శర్మనే భావిస్తున్నారు.
మరోవైపు బౌలింగ్ లో మాత్రం ఆర్సీబీ కాస్త వీక్ గానే ఉంది. ఎందుకంటే హ్యాజిల్ వుడ్ ఇంకా ఫిట్ నెస్ సాధించకపోవడంతో తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పటికే యశ్ దయాల్, తుషారా కూడా ఈ సీజన్ కు అందుబాటులో లేరు. దీంతో పేస్ భారం భువనేశ్వర్ పైనే పడనుంది. స్పిన్ విభాగంలో సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా కీలకం కానున్నారు. ఇదిలా ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా వెంకటేశ్ అయ్యర్, సుయాశ్ శర్మలలో ఒకరిని బరిలోకి దించే అవకాశముంది.
మరోవైపు గత ఏడాది ఆశించిన ప్రదర్శన కనబరచలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్(RCB vs SRH) కొత్త సీజన్ ను ఘనవిజయంతో ఆరంభించాలని పట్టుదలగా ఉంది. ఆర్సీబీని వారి సొంతగడ్డపైనే ఓడించి తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోవాలని ఎదురుచూస్తోంది. ప్యాట్ కమిన్స్ జట్టుతో చేరినప్పటకీ ఇంకా ఫిట్ నెస్ సాధించలేదు.
దీంతో తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు. బ్యాటింగ్ పరంగా సన్ రైజర్స్ కు తిరుగులేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీని చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. గత సీజన్ లో వీరిద్దరూ ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడారో అభిమానులు మరిచిపోలేదు. అలాగే ఇషాన్ కిషన్ , క్లాసెన్ , నితీశ్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టోన్ లాంటి హిట్టర్లు కూడా సన్ రైజర్స్ కు అడ్వాంటేజ్.
అందుకే ఈ సారి 300 ప్లస్ స్కోరు సాధిస్తుందంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే బౌలింగ్ లో మాత్రం సన్ రైజర్స్ బలహీనంగా మారింది. కమిన్స్ లేకపోవడంతో మ్యాచ్ ను మలుపుతిప్పే బౌలర్లు ఎవ్వరూ జట్టులో కనిపించడం లేదు. ఉనాద్కట్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ ఎంతవరకూ ఆర్సీబీ(RCB vs SRH) బ్యాటర్లను కట్టడి చేస్తారో చూడాలి.
చిన్నస్వామి స్టేడియం ఎప్పుడూ బ్యాటర్లకే అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు, పిచ్ ఫ్లాట్ ఉండడంతో ఇక్కడ భారీస్కోర్లు నమోదవుతుంటాయి. ఛేజింగ్ జట్టుకు ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. పేసర్లు తెలివిగా బౌలింగ్ చేస్తే పై చేయి సాధిస్తారు. భారీస్కోర్లు నమోదవడం ఖాయం.
Ram Charan : కుస్తీ వీరునిగా రామ్ చరణ్…గూస్ బంప్స్ తెప్పిస్తున్న పెద్ది గ్లింప్స్
