IPL Carnival
టీ20 ప్రపంచకప్ తర్వాత మరో భారీ ఎంటర్ టైన్ మెంట్ క్రికెట్ అభిమానుల ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ శనివారం నుంచే మొదలు కాబోతోంది. ప్రతీరోజూ రాత్రి 7.30 అయిందంటే ఇక అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయం.
టీ20 లీగ్స్ లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఐపీఎల్(IPL Carnival) వచ్చిందంటే చాలు రెండు నెలల పాటు ఫ్యాన్స్ కు క్రికెట్ వినోదమే. నిన్నటి వరకూ ఒకే జట్టులో ఆడిన ఆటగాళ్లందరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోతారు. దేశాభిమానం కాస్తా నగరాల మధ్య క్రికెట్ సమరాలుగా మారుతుంది. స్వదేశీ, విదేశీ టీ20 స్టార్లతో 10 జట్ల మధ్య మైదానంలో హోరాహోరీ యుద్ధమే.
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి చాలా జట్ల కూర్పులు మారాయి. మినీ వేలంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్ ను వదిలేసి కొత్తగా మరికొందరు ఆటగాళ్లను తీసుకున్నాయి. గత సీజన్ లో వైఫల్యాన్ని మరిచిపోయి ఈ సారి చెలరేగేందుకు తమ కూర్పును మార్చుకున్న జట్లు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
ఐపీఎల్(IPL Carnival) బ్రాండ్ ఏడాది ఏడాదికీ పెరుగుతూ వస్తోంది. 2008లో 8 జట్లతో మొదలైన లీగ్ 2022 నుంచి 10 జట్లకు విస్తరించారు. 60 మ్యాచ్ లు కాస్తా ఇప్పుడు 74 మ్యాచ్ లు అయ్యాయి. అటు లీగ్ బ్రాండ్ వాల్యూనే కాదు ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ కూడా ఊహించని విధంగా పెరిగింది. ఇటీవల ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు విక్రయించినప్పుడు వచ్చిన బిడ్డింగ్ ధరలే దీనికి ఉదాహరణ.
అటు ఆటలోనూ సరికొత్త మార్పులు గత కొన్ని సీజన్లుగా ఫ్యాన్స్ కు అసలు సిసలు వినోదాన్ని అందిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వంటిని ఆటను మరింత రసవత్తరంగా మార్చేశాయి. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది.
17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ ఈ సారి కూడా భారీ అంచనాలతో సిద్ధమైంది. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఐదేసి టైటిల్స్ తో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ సిక్సర్ కొట్టేందుకు ఎదురుచూస్తున్నాయి.
అలాగే గత సీజన్ లో టైటిల్ ను తృటిలో చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్ తో పాటు ఇప్పటి వరకూ ట్రోఫీని ముద్దాడని ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ కీలక మార్పులతో కొత్త సీజన్ కు సిద్ధమయ్యాయి.
గ్రూప్ ఏ ః చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్
గ్రూప్ బి ః ముంబై ఇండియన్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ , గుజరాత్ టైటాన్స్ , ఢిల్లీ క్యాపిలటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్
Ram Charan : కుస్తీ వీరునిగా రామ్ చరణ్…గూస్ బంప్స్ తెప్పిస్తున్న పెద్ది గ్లింప్స్
