RCB : ఇప్పుడే మనకు అసలు పరీక్ష..ఆర్సీబీ ప్లేయర్స్ కు కోహ్లీ హెచ్చరిక

RCB : ఐపీఎల్ 19వ సీజన్ కు వచ్చే వారం నుంచే తెరలేవబోతోంది. అన్ని జట్లు ప్రిపరేషన్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది

RCB

ఐపీఎల్ 19వ సీజన్ కు వచ్చే వారం నుంచే తెరలేవబోతోంది. అన్ని జట్లు ప్రిపరేషన్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. ఎన్నో ఏళ్లుగా జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా టైటిల్ గెలవని ఆర్సీబీ(RCB) ఎట్టకేలకు 18వ సీజన్ లో ట్రోఫీ కలను నెరవేర్చుకుంది.

విరాట్ కోహ్లీతో సహా కీలక ఆటగాళ్ళందరూ సమిష్టిగా రాణించడంతో ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు రెండోసారి టైటిల్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ(RCB)పై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తమ టీమ్ ప్లేయర్స్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి నుంచే అసలైన పరీక్ష మొదలవుతుందని హెచ్చరించాడు.

చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ట్రైనింగ్ సెషన్ లో సహచరులను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చాడు. గత రెండు మూడు సీజన్లలో బాగా కష్టపడినందుకు 2025లో ట్రోఫీ గెలిచామనీ, ఇకపై పరిస్థితి మరింత కఠినంగా ఉంటుందన్నాడు. గతంతో పోలిస్తే మిగిలిన జట్లు తమపై మరింత బలంగా ఎటాక్ చేస్తాయన్నాడు. అందుకే తాము మరింత అప్రమత్తంగా ఉండాలనీ, ప్లేయర్స్ ఎవ్వరూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకూడదన్నాడు.

RCB

ప్రతీ ప్రాక్టీస్ సెషన్ లో 120 శాతం ఇవ్వాలనీ, మ్యాచ్ లో 200 శాతం ఎఫర్ట్ పెట్టాలన్నాడు. ఈ రెండు నెలల పాటు మరింత కష్టపడాలంటూ సహచరులను ఉత్సాహపరిచాడు. గత సీజన్ వరకూ టైటిల్ కోసం పోరాడిన తాము ఇప్పుడు దానిని నిలబెట్టుకునేందుకు మరింతగా కష్టపడాలని స్పష్టం చేశాడు. అందుకే మరింత ఒత్తిడి ఉంటుందని సహచరులను హెచ్చరించాడు. మరోవైపు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా కోహ్లీ వ్యాఖ్యలతో ఏకీభవించాడు.

ఈ సీజన్ కోసం తమ ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకున్నట్టు చెప్పాడు. జట్టు కూర్పుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలం ఆసక్తికరంగా సాగిందనీ, తమ బెంచ్ ను మరింత మెరుగుపరుచుకున్నట్టు చెప్పాడు. కొత్తవారి రాకతో జట్టు బలం పెరిగందన్నాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో విరాట్ కోహ్లీపైనే అందరి చూపు ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా టెస్ట్, టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ ఐపీఎల్ లో ఎలా ఆడతాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ustaad Bhagat Singh:ఉస్తాద్‌కు అడ్డం పడుతున్న ధురంధర్.. వీకెండ్ కింగ్ ఎవరు?

Exit mobile version