Lucknow Super Giants : లక్నో సాధిస్తుందా ?..పంత్ కెప్టెన్సీకి పరీక్ష

Lucknow Super Giants : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి లక్నో సూపర్ జెయింట్స్ 2022లో అడుగుపెట్టింది. అంచనాలకు మించి రాణించి వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరుకుంది

Lucknow Super Giants

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 2022లో అడుగుపెట్టింది. అంచనాలకు మించి రాణించి వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరుకుంది. కేఎల్ రాహుల్ తొలి సీజన్ లో జట్టును అద్భుతంగా నడిపిస్తే.. తర్వాత కృనాల్ పాండ్యా స్టాండిన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే 2024, 2025 సీజన్లలో మాత్రం లక్నో నిరాశపరిచింది.

2024 సీజన్ లో ఏడో స్థానానికి పరిమితమవడం, కెప్టెన్ రాహుల్ తో ఫ్రాంచైజీ ఓనర్లకు విభేదాలు రావడంతో అతను జట్టును వీడాడు.ఆ తర్వాత వేలంలో రిషబ్ పంత్ ను రికార్డు ధర రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో అతనికే పగ్గాలు అప్పగించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్ సారథిగా ఫ్లాప్ అయ్యాడు.

దీంతో ఈ సారి తనపై ఉన్న అంచనాలను అందుకోవాలని పంత్ పట్టుదలగా ఉన్నాడు. మినీ వేలానికి ముందు జట్టులో పలు మార్పులు చేసుకుంది. సపోర్టింగ్ స్టాఫ్ ను మార్చుకోవడంతో పాటు కొందరు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ నుంచి మహ్మద్ షమీని, వేలంలో జోస్ ఇంగ్లీస్, రఘువంశీ, ముకుల్ చౌదరీలను దక్కించుకుంది. ముంబై నుంచి అర్జున్ టెండూల్కర్ ను కూడా ట్రేడ్ చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కు హిట్టర్లే ప్రధాన బలం.

బ్యాటింగ్ కాంబినేషన్ ను చూస్తే మిఛెల్ మార్ష్ , మార్క్ క్రమ్, పంత్ , నికోలస్ పూరన్ వంటి హిట్టర్లతో అత్యంత బలంగా ఉంది. విధ్వంసకర ఇన్నింగ్స్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పూరన్ లాంటి బ్యాటర్ ఆ జట్టుకు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. పంత్ కూడా బ్యాట్ తో చెలరేగితే తిరుగుండదు. గత(Lucknow Super Giants) సీజన్ లో అతను అంతగా రాణించలేదు. ఒకవిధంగా ఆ ఐపీఎల్ సీజన్ పంత్ అంతర్జాతీయ కెరీర్ కు కూడా కీలకం కాబోతోంది.

మరోవైపు బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీపై అంచనాలున్నాయి. అతని అనుభవం లక్నోకు కలిసొస్తుంది. అలాగే మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ వంటి దేశవాళీ పేస్ బౌలర్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో నోర్జే కీలకం కానున్నాడు. అర్జున్ టెండూల్కర్ ను కూడా మీడియం పేసర్ గా ఉపయోగించుకునే అవకాశముంది.

Lucknow Super Giants

అయితే పేసర్లంతా ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతుండడం మైనస్ పాయింట్. అటు స్పిన్ విభాగంలో హసరంగాపై అంచనాలున్నాయి. దేశవాళీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపైనా లక్నో ఆశలు పెట్టుకుంది. గత సీజన్ లో దిగ్వేశ్ సత్తా చాటాడు. లక్నో జట్టుకు కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. ఎక్కువమంది హిట్టర్లున్నా సమిష్టిగా రాణించలేకపోతుండడం గత సీజన్ లో ప్రభావం చూపింది. లోయర్ ఆర్డర్ లో బదోని, అబ్దుల్ సమద్ కూడా నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు.

సరైన మ్యాచ్ ఫినిషర్ లేకపోవడం కూడా లక్నోకు మైనస్ గా మారింది. పూరన్, పంత్ తర్వాత మ్యాచ్ ను ఒంటిచేత్తో మలుపు తిప్పే బ్యాటర్ లేకపోవడం కూడా ఇబ్బందిగా కనిపిస్తోంది. అటు బౌలింగ్ లో పేసర్లు ఎంతవరకూ సమిష్టిగా రాణిస్తారనేది చూడాలి. గత సీజన్ లో షమీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా ట్రేడింగ్ లో అతన్ని తీసుకున్న లక్నో పేస్ ఎటాక్ ను షమీ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

IPL Captains : ఇంపాక్ట్ రూల్ ఉండాల్సిందే..కెప్టెన్ల మీటింగ్ లో తేల్చిచెప్పిన బీసీసీఐ

Exit mobile version